- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఎస్పీఎస్సీ బోర్డు కేసులో మరో ఇద్దరి అరెస్ట్..!
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నాపత్రాల చోరీ కేసులో సిట్ అధికారులు తాజాగా మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ కేసులో విచారణ అనుకున్నంత వేగంగా జరగటం లేదని ఇటీవల హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో సిట్అధికారులు దర్యాప్తు వేగాన్ని పెంచారు. ఈ కేసులో అరెస్టయిన నిందితులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను మరోసారి విశ్లేషించిన అధికారులు వాటి ద్వారా లభ్యమైన వివరాల క్రమంలోనే తాజా అరెస్టులు జరిపినట్టు సమాచారం.
టీఎస్పీఎస్సీ బోర్డులో అసిస్టెంట్సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్కుమార్నెట్వర్క్ఇంఛార్జీగా ఔట్‌సోర్సింగ్‌పై ఉద్యోగం చేస్తున్న రాజశేఖర్‌రెడ్డితో కలిసి కాన్ఫిడెన్షియల్ రూంలోని కంప్యూటర్ నుంచి వేర్వేరు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను సెట్లకు సెట్లు కొట్టేసిన విషయం తెలిసిందే. దీంట్లో ఏఈఈ సివిల్, జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన ప్రశ్నాపత్రాలు కూడా ఉన్నాయి. వీటిని ప్రవీణ్ కుమార్ తనకు పాత పరిచయం ఉన్న గురుకుల టీచర్ రేణుకకు పదిలక్షల రూపాయలకు విక్రయించాడు. రేణుక తన భర్త లద్యావత్ డాక్యా నాయక్‌కు ఇవ్వగా అతను వేర్వేరు వ్యక్తులకు వీటిని విక్రయించాడు.
తాజాగా డాక్యా నాయక్ బ్యాంక్ అకౌంట్‌ను పరిశీలించినపుడు భగవంత్ కుమార్ అనే వ్యక్తి అతని అకౌంట్లోకి లక్షా డెబ్భయి అయిదు వేల రూపాయలు జమ చేసినట్టు వెల్లడైంది. ఈ క్రమంలో సిట్అధికారులు భగవంత్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని జరిపిన విచారణలో తన తమ్ముడు రవి కుమార్ కోసం ఏఈఈ సివిల్, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నాపత్రాలను రెండు లక్షలకు కొన్నట్టుగా వెల్లడించాడు. ఈ ప్రశ్నాపత్రాల సహాయంతో రవికుమార్ పరీక్ష కూడా రాసినట్టు చెప్పాడు. ఈ నేపథ్యంలో సిట్అధికారులు రవికుమార్‌ను కూడా అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 21కి చేరింది.
తాజాగా అరెస్టయిన అన్నదమ్ములు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినవారు కావటం గమనార్హం. ఇక, ఇదే కేసులో నిందితునిగా ఉండి ప్రస్తుతం న్యూజీలాండ్‌లో ఉన్న ప్రశాంత్‌రెడ్డి ఇంకా అరెస్టు కావాల్సి ఉంది. హైదరాబాద్ రావాలని చెప్పినా ప్రశాంత్ రెడ్డి స్పందించటం లేదని సిట్‌కు చెందిన ఓ అధికారి చెప్పారు. ఈ క్రమంలో అతన్ని ఇక్కడకు రప్పించటానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు.