- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు
దిశ, ఆసిఫాబాద్ : వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎఫ్ వో నీరజ్ కుమార్ హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాగజ్ నగర్ డివిజన్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో సోమవారం బెంగాలీ క్యాంప్ కు చెందిన గౌతం అశోక్ ఠాగూర్ తన పొలంలో అమర్చిన విద్యుత్ తీగలకు చిక్కిన అడవి పందిని అదే క్యాంప్ కు చెందిన దీపక్ ఠాగూర్, ప్రణబ్ మండల్ అలియాస్ పింకు మండల్, శంకర్ బెపారిఅరవింద్ లతో పాటు హిరాపూర్ కు చెందిన కుమ్మరి పోచంలు కలిసి అడవి పందిని కోసి మాంసం ఇంటికి తరలించినట్లు వచ్చిన సమాచారం మేరకు అడవి శాఖ అధికారులు ఇండ్లలో తనిఖీలు చేశారు. అడవి పంది మాంసం స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చిన ట్లు తెలిపారు. అలాగే ఏనుగు ప్రస్తుతం తన అడవి ప్రాంతంలో లేదని, ఛత్తీస్గఢ్ సంచారిస్తోందని, అక్కడ అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఏనుగుకు సంబంధించిన సమాచారం తెలుసుకుంటున్నట్లు పేర్కొన్నారు.