- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
suicide : పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య
దిశ, చందుర్తి : చందుర్తి మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో వివాహిత ఆత్మహత్య (Marital suicide)కు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన ఆరేపల్లి అపర్ణ (28)కు ఎనిమిది సంవత్సరాల కుమారుడు, రెండు సంవత్సరాల పాప ఉన్నారు. గత రెండు సంవత్సరాల నుండి భార్యాభర్తల మధ్య తరచూ కుటుంబ కలహాలు జరుగుతున్నాయి.
ఈ గొడవలతోనే అపర్ణ (Aparna)పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అది గమనించిన కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. అపర్ణ తల్లి శంకరమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అపర్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా అపర్ణ భర్త లక్ష రూపాయల అధిక వరకట్నం, మోటార్ సైకిల్ తీసుకురావాలని నిత్యం వేధించేవాడని అపర్ణ తల్లి కొంపెల్లి శంకరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.