- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vijay 69 Movie : ‘విజయ్ 69’ ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher)ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘విజయ్ 69’ (Vijay 69 Movie). నవంబర్ 8 నుంచి ప్రముఖ ఓటీటీ (OTT)సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix) వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే 69 ఏళ్ల వయస్సులో అనుపమ్ ఖేర్ ట్రయాథ్లాన్‌లో పాల్గొని భారతదేశంలో కొత్త రికార్డ్ సాధించాలని కలలు కంటాడు. అయితే.. దీనికి 1.5 కి.మీ స్విమ్మింగ్(Swimming), 40 కి.మీ రన్నింగ్ సైక్లింగ్(Cycling), 10 కి.మీ రన్నింగ్ (running) పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో.. తన చుట్టూ ఉండే ఇతరులు అతడిని డిసప్పాయింట్ చేయడంతో పాటు.. ఎగతాళి చేస్తారు.
అయితే.. మిహిర్ అహుజా పాత్ర అతనికి శిక్షణ ఇస్తారు. అందరితో పోరాడుతూ, విజయ్ ట్రయాథ్లాన్(Triathlon)లో పాల్గొనడానికి తన ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తాడు. ఈ క్రమంలోనే ఆయన ఆసుపత్రిలో కూడా చేరతాడు. అయితే.. ఈ వయసులో నీకు ఎందుకు ఇవన్నీ అని చుట్టూ ఉన్నవారు తనను తిడతారు. కానీ "సప్నో కి కోయి ఎక్స్‌పైరీ డేట్ నహీ హోతీ (కలల గడువు తేదీ లేదు)" అని డైలాగ్ చెప్పిన అనంతరం.. అతడు ట్రయాథ్లాన్‌లో పాల్గొనడంతో ట్రైలర్ ముగుస్తుంది. కాగా.. ట్రైలర్ మొత్తం నవ్వులతో పాటు ఎమోషనల్‌గా కూడా ఎంతో ఆకట్టుకుంది. అయితే.. ప్రజెంట్ ట్రైలర్ హిందీలో వచ్చినప్పటికీ.. స్ట్రీమింగ్ అవుతున్నప్పుడు తెలుగులో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది