- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పూచీకత్తు చెల్లించలేని ఖైదీల సమాచారం వారి కుటుంబాలతో చర్చించాలి
దిశ, ప్రతినిధి నిర్మల్ : జైలు జీవితం గడుపుతూ బెయిల్ పొందే అర్హత ఉన్న ఖైదీలు ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారి సమాచారాన్ని సేకరించి వారి కుటుంబ సభ్యులకు తెలుపాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా ఎంపవర్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని జైళ్ళలో వివిధ కేసుల్లో శిక్షణ అనుభవిస్తూ, బెయిల్ పొందడానికి అర్హత ఉన్నప్పటికీ, బెయిల్ కు సంబంధించిన పూచీకత్తు చెల్లించే ఆర్థిక స్తోమత లేని ఖైదీల కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలను సంబంధిత అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, జిల్లా ఎంపవర్డ్మెంట్ కమిటీ సెక్రటరీ జి.రాధిక, డీఎస్పీ గంగారెడ్డి, జిల్లా జైలు సూపరిండెంట్ సిహెచ్ చిరంజీవి, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.