- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Israel Airstrike: గాజాలో 93 మంది మృతి
దిశ, నేషనల్ బ్యూరో: గాజా(Gaza)లోని బెయిత్ లాహియా పట్టణంపై ఇజ్రాయెల్ వైమానికదాడి(Israel Airstrike) చేసింది. ఉత్తర గాజా జిల్లా బెయిత్ లాహియా(Beit Lahiya)లోని నివాస భవనంపై నిర్వహించిన ఈ దాడిలో కనీసం 93 మంది మరణించారని గాజా పౌర రక్షణ ఏజెన్సీ వెల్లడించింది. మరో 40 మంది వరకు ఇంకా భవన శిథిలాల కిందే చిక్కుకుని ఉన్నట్టు వివరించింది. మృతుల్లో 20 మంది వరకు చిన్నారులు ఉన్నట్టు పేర్కొంది. ఆ భవనంలో సుమారు 200 మంది తలదాచుకుంటున్నట్టు తెలిసింది. రాత్రిపూట ఇజ్రాయెల్ చేపట్టిన వైమానిక దాడితో ఎటుచూసినా భవన శిథిలాలు.. మానవ దేహాలు కనిపించాయి. క్షతగాత్రులను హాస్పిటల్ తరలించే ప్రయత్నాలు చేస్తున్నా.. అక్కడ సరిపడా వైద్య సేవలు అందుబాటులో లేవు. కమల్ అద్వాన్ హాస్పిటల్‌లో ప్రాథమిక చికిత్స అవసరమైన మెటీరియల్ మినహా ఇతర ఔషధాలు పెద్దగా లేవని ఆ హాస్పిటల్ డైరెక్టర్ హుస్సామ్ అబు సాఫియా వివరించారు. జబాలియాలో ఇజ్రాయెల్ ఆర్మీ ఆపరేషన్ చేపట్టినప్పుడు వైద్య సిబ్బందిని అరెస్టు చేయడంతో మెడికల్ టీమ్ కూడా లేదని ఆయన తెలిపారు.