- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఉగ్ర’ కుట్ర కేసులో మరో ఇద్దరి అరెస్ట్..
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ‘ఉగ్ర’ కుట్ర కేసులో భోపాల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులతో కలిసి సోమవారం మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు మన పోలీసులతో కలిసి హిజ్బుత్ తెహ్రీర్ హైదరాబాద్ మాడ్యూల్‌కు చెందిన ప్రధాన సూత్రధారి యాసిన్‌తోపాటు మరో నలుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిని భోపాల్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. కాగా, రెండు రోజుల క్రితం కోర్టు అనుమతితో ఈ అయిదుగురిని కస్టడీకి తీసుకున్న యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు జరిపిన విచారణలో పాతబస్తీ చాంద్రాయణగుట్ట ప్రాంతంలోని బాబానగర్‌లో మరికొందరు ఉన్నట్టుగా వెల్లడైంది.
ఈ క్రమంలో కస్టడీకి తీసుకున్న నిందితులను వెంటబెట్టుకుని హైదరాబాద్ చేరుకున్న యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు రాష్ర్ట కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులతో కలిసి సోమవారం మధ్యాహ్నం బాబానగర్ వెళ్లారు. అరెస్టయిన నిందితులు చూపించిన ఇండ్ల నుంచి మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్సిట్వారెంట్పై ఈ ఇద్దరిని కూడా భోపాల్తరలించనున్నారు. దానికి ముందు ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు హైదరాబాద్‌లో ఉన్నారా? అన్న విషయమై నిందితులను ప్రశ్నించనున్నారు. ఉన్నట్టయితే వారిని కూడా అరెస్టు చేసి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.