Shri Ram Sagar Project: ఇందిరమ్మ కాలువకు నీటి విడుదల

by Naveena |
Shri Ram Sagar Project: ఇందిరమ్మ కాలువకు నీటి విడుదల
X

దిశ, బాల్కొండ : శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు( Shri Ram Sagar Project) నుంచి ఇందిరమ్మ వరద కాలువకు నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ఇందిరమ్మ వరద కాలువకు 4000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు డిఈ గణేష్ తెలిపారు.ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ రిజర్వాయర్ లోకి 14 వేల క్యూసెక్కుల వరద కొనసాగుతుందన్నారు. దీంతో అధికారుల ఆదేశానుసారం వరద కాలువ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కాలువలో ప్రవాహం ఎక్కువగా ఉన్నందున జాలర్లు చేపల వేటకు వెళ్లరాదని సూచించారు. అదేవిధంగా కాకతీయ కాలువకు 4000, లక్ష్మికి 150, సరస్వతి 500 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed