- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Disha Special Story: మార్కెట్‌లోకి డిజిటల్ కండోమ్.. సెక్స్‌లో పాల్గొనే జంటలకు ఫుల్ సేఫ్టీ
నేటితరం యువత సెక్స్ కోసం అర్రులు చాస్తోంది. సమయం దొరికితే చాలు.. టక్కున బెడ్‌రూంలో దూరిపోతోంది. ఇలా ఆలుమగలే కాదు.. లవర్స్, అక్రమసంబంధాలు పెట్టుకున్న వారు ‘ఆ’ చాన్స్ కోసం ఎదురు చూస్తుంటారు. ఈ సమయాల్లో కొందరు శృంగార దృశ్యాలను ఫొటోలు, వీడియోలు తీసుకుంటారు. మరికొన్ని సమయాల్లో హోటళ్లు, లాడ్జీలకు వెళ్లే జంటల కామలీలలను అక్కడి కేటుగాళ్లు సీక్రెట్ కెమెరాలతో బందీస్తారు. ఆ తర్వాత వాటిని చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తుంటారు, అత్యాచారాలు చేస్తుంటారు. ఇష్టపూర్వకంగా వీడియోలు తీసుకున్న లవర్స్, వివాహేతర సంబంధాల్లోనూ ఇలాంటి బెదిరింపులు చూస్తూనే ఉంటాం. ఇలాంటి వాటికి చెక్ పెట్టేదే డిజిటల్ కండోమ్. కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన ఈ డిజిటల్ కండోమ్ అందరినీ ఆకర్షిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ఈ డిజిటల్ కండోమ్ ఎలా పని చేస్తుందో తెలుసుకుందాం. - భూపతి నాగయ్య
ఈ కండోమ్ నిరోద్ కాదు..
నిజానికి దీనిపేరు కండోమ్(Condom) కాదు. ‘కాండోమ్’ (CAMDOM). దీనిని సెక్స్ సమయంలో వాడినా.. ఇది నిరోద్ మాత్రం కాదు. ఇదొక డిజిటల్ యాప్. శృంగార సమయంలో మన అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు, ఆడియోలను రికార్డు చేయకుండా నిరోధిస్తుంది. కనీసం శృంగార శబ్దాలను కూడా ఫోన్‌లో నమోదు కాకుండా అరికట్టగలుతుంది. ఒకవేళ అలా ఎవరైనా సీక్రెట్‌గా ప్రయత్నించినా మన ఫోన్‌లో అలారం మోగుతుంది.
కాండోమ్‌ను ఎలా ఉపయోగించాలి..? ఎలా పని చేస్తుంది..?
ఈ కాండోమ్‌ను ఆపరేట్ చేయడం చాలా ఈజీగానే ఉంటుంది. శృంగార సమయంలో ఈ డిజిటల్ యాప్‌ను ఆన్ చేసి పెట్టాలి. భాగస్వాముల ఇద్దరి ఫోన్లను పక్కపక్కన్నే పెట్టాలి. స్మార్ట్ ఫోన్‌లోని బ్లూటూత్ ఆన్ చేయాలి.ఆ తర్వాత యాప్‌లోని వర్చువల్ బటన్‌ను క్రిందికి స్వైప్ చేయాలి. ఈ ప్రక్రియతో యాప్ ఆన్‌లోకి వస్తుంది. ఈ సమయంలో ఎవరైనా వీడియో, ఆడియో రికార్డ్ చేయాలని ప్రయత్నిస్తే వెంటనే భాగస్వాముల మొబైల్‌లో అలారం మోగుతుంది. అలాగే రికార్డు చేయడానికి ప్రయత్నించే వారి స్మార్ట్ ఫోన్, హెడెన్ కెమెరాలను ఏకకాలంలో బ్లాక్ చేసింది. యాప్‌లను పని చేయకుండా ఆపేస్తుంది. సెక్స్ చేసే ముందు ఈ యాప్‌ని ఓపెన్ చేస్తే సీక్రెట్ కెమెరాలు, మైక్రోఫోన్ల వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఆ గదికి ఏవైనా కనెక్ట్ అయ్యాయో లేదో చూపిస్తుంది. ఇకవేళ కనెక్ట్ అయివుంటే ఆ గాడ్జెట్స్‌ను ఈ యాప్ గుర్తించి యూజర్లను బీప్ సౌండ్ లేదా అలారం ద్వారా హెచ్చరిస్తుంది. ఆ గాడ్జెట్స్‌ను షడౌన్ చేస్తుంది.
అమ్మాయిలకు సెఫ్టీనేనా..?
ఈ డిజిటల్ కండోమ్ యాప్ అమ్మాయిలకు మంచి భద్రత ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా అమ్మాయిలు కొత్త ప్రదేశాలకు వెళ్లిన సమయంలో, షాపింగ్ మాల్స్, ఆఫీసుల్లో తమ ఛాంబర్లు, రెస్ట్ రూముల్లో సీక్రెట్ కెమెరాల బెడద నుంచి తప్పించుకోవచ్చు. హోటల్ గదుల్లో తమ ప్రైవసీ దెబ్బతినకుండా జాగ్రత్తపడవచ్చు. ప్రేమలో ఉన్న జంటలు న్యూడ్ వీడియోల భారీన పడే అవకాశం ఉండదు. కాలేజీ, హాస్టల్ బాత్ రూముల్లోనూ అమ్మాయిలకు సేఫ్టీ లభిస్తుంది. వివాహేతర సంబంధాల్లో ఉన్న జంటలు భాగస్వామి నుంచి బ్లాక్ మెయిలింగ్‌కు గురికాకుండా ఉండటం, రివైంజ్ శృంగారాన్ని అరికడుతుంది.
కండోమ్ సృష్టికర్తలు ఎవరు..?
జర్మనీకి చెందిన బిల్లీ బాయ్ (Billy Boy) అనే సెక్సువల్ హెల్త్ కేర్ కంపెనీ(Sexual Health Care Company) దీన్ని డెవలప్ చేసింది. డిజిటల్ కండోమ్‌ను విడుదల చేసిన ఈ సంస్థ ‘నిజమైన కండోమ్‌ను ఉపయోగించేటంత సులభం’ అనే ట్యాగ్ లైన్‌ను జతచేసింది. ఈ యాప్‌ను ఫెలిప్ అల్మేడా (Felipe Almeida) అనే వ్యక్తి డెవలప్ చేశారు.
కంపెనీ ఉద్దేశ్యం ఏంటి..?
సమాజంలోని ప్రతి ఒక్కరి గోప్యతను కాపాడేందుకు బిల్లీ బాయ్ సెక్సువల్ హెల్త్ కేర్ కంపెనీ కట్టుబడి ఉందని ఆ సంస్థ మేనేజర్ అలెగ్జాండర్ స్టూమాన్ (Manager Alexander Stuman) చెప్పారు. మీడియాలో ఆయన మాట్లాడుతూ ‘‘బిల్లీ బాయ్ భౌతిక రక్షణకు ప్రసిద్ధి చెందిన బ్రాండ్. కొత్త యుగంలో తదుపరి దశలోకి ప్రవేశించాలని కంపెనీ నిర్ణయించింది. శృంగారంతో సహా వారి ప్రైవేట్ క్షణాలలో వ్యక్తుల ఏకాభిప్రాయం లేని వీడియో లేదా ఆడియో రికార్డింగ్‌ను నిరోధించడం తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు’’గా చెప్పారు. ఈ యాప్ డెవలపర్ ఫెలిప్ అల్మేడా మాట్లాడుతూ ఈ రోజుల్లో ఫోన్లు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయని చెప్పారు. మన ప్రైవేట్ డేటా చాలా వరకు మన ఫోన్లోనే ఉంటుంది. అందువల్ల అనుమతి లేకుండా మీ వ్యక్తిగత విషయాలను రికార్డ్ చేయకుండా ఉండటానికి, బ్లూటూత్ ఉపయోగించి ఫోన్ కెమెరా, మైక్‌ను బ్లాక్ చేయగల మొదటి యాప్‌ను సృష్టించామన్నారు.
ఆ వీడియోలు ఇక నో లీక్..
సమాజంలో ప్రతీకార అశ్లీలత అంటూ ప్రైవేట్ మూమెంట్స్ వీడియోలను విడుదల చేసే ఘటనలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ ఇలాంటి ఆలోచన చేసింది. ప్రతీకార అశ్లీలత అనేది సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరినీ ప్రభావితం చేస్తుంది. దీని వల్ల బాధితులు సమాజంలో చిన్నచూపునకు, అవమానాలకు గురవుతున్నారు. పోర్చుగల్ (Portugal)లోని ఎగాస్ మోనిజ్ స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (Egas Moniz School of Health Sciences) నిర్వహించిన అధ్యయనాల్లో రివెంజ్ పోర్న్ నిరాశ, ఆందోళన, సామాజిక ఉపసంహరణ వంటి మానసిక ప్రభావాలకు దారితీస్తుందని తేలింది. వీటికి చెక్ పెట్టేందుకే డిజిటల్ కండోమ్‌కు నాంది పడింది.
30కి పైగా దేశాల్లో అందుబాటులోకి..
ఈ డిజిటల్ కండోమ్ యాప్ ప్రస్తుతం 30కి పైగా దేశాల్లో వినియోగంలో ఉన్నది. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా, రాబోయే రోజుల్లో ఐఓఎస్ యూజర్లకు కూడా అందుబాటులోకి రానున్నది.
నిరోద్‌కు డిజిటల్ కండోమ్‌కు తేడా ఇదే..
శృంగార సమయంలో నిరోద్ అవాంఛీత గర్భధారణ, సెక్స్‌వల్ సుఖ వ్యాధులను దరి చేరకుండా చేయడంలో పగడ్భందీగా పనిచేస్తుందనడంలో సందేహం లేదు. ఫ్యామిలీ ప్లానింగ్‌కు కూడా ఈ సాధనాన్ని కొన్ని జంటలు ఫాలో అవుతుంటాయి. ఇక డిజిటల్ కండోమ్.. వ్యక్తిగత ప్రైవసీని కాపాడుతుంది. మన అనుమతి లేకుండా మన పర్సనల్ వీడియోలు, ఆడియోలు తీయకుండా కాపాడుతుంది. రివైంజ్ శృంగారాన్ని అరికడుతుంది. బ్లాక్ మెయిలింగ్‌ను తగ్గిస్తుంది.
For more Sex and Science stories : https://www.dishadaily.com/Sexeducation