- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
CM Revanth Reddy: మొత్తానికి నా కల నెరవేరింది.. ఇప్పుడు నా ముందున్న లక్ష్యం అదే

దిశ, వెబ్‌డెస్క్: మూసీ పునరుజ్జీవం(Musi Cleansing)పై అతి త్వరలో అఖిలపక్ష సమావేశం(All Party Meeting) ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేర్కొన్నారు. మంగళవారం సీఎం మీడియా ఛానల్ ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మూసీపై ఆల్రేడీ నిర్ణయం తీసుకున్నాం.. ముందడుగు వేశాం.. ఇక వెనక్కి తగ్గే పరిస్థితే లేదని స్పష్టం చేశారు. నిర్ణయం తీసుకునే ముందే వెయ్యిసార్లు ఆలోచిస్తాం.. నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తగ్గబోం అని అన్నారు. వచ్చే నవంబర్ 1వ తేదీ నుంచి మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు(Musi Project) పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. బాపూఘాట్(Bapughat) నుంచి మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు(Musi Project) పనులు ప్రారంభం అవుతాయని అన్నారు. నవంబర్‌లోపే మూసీ ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలుస్తామని పేర్కొన్నారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పనులపై విపక్షాలతో చర్చలకు తాము సిద్ధమని కీలక ప్రకటన చేశారు.
త్వరలోనే అఖిలపక్షం(All Party Meeting) ఏర్పాటు చేసి సలహాలు తీసుకుంటామని అన్నారు. ఏవేం అభ్యంతరాలు ఉన్నాయో ఆరోజు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చెప్పాలని సూచించారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరుగుతోందని అన్నారు. విచారణ విషయంలో కక్షసాధింపు చర్యలు ఉండవని చెప్పారు. దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగానే చర్యలు ఉంటాయని అన్నారు. మూసీ విషయంలో రాజకీయంగా నష్టం జరిగిగా వెనకడుగు వేయం అని తేల్చి చెప్పారు. ప్రజలకు మంచి చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు చేసి తీరుతామని ప్రకటించారు. ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న నా కల నెరవేరింది. ముఖ్యమంత్రి కంటే ఇక పెద్ద కలలేమీ నాకు లేవు. ప్రజలకు మంచి చేయడమే నా కల, కర్తవ్యం అని అన్నారు. రైతులు, పేదలు, మహిళలు అందరూ సంతోషంగా ఉండాలనేదే నా కల అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులు, మహిళలు ఆనందంగా ఉంటే ఆ రాజ్యం సంతోషంగా ఉన్నట్లే అని అన్నారు.