- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ponguleti: దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇళ్లు.. మంత్రి పోంగులేటి కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: మాది రైతు పక్షపాత ప్రభుత్వమని, తల తాకట్టు పెట్టైనా అర్హులైన రైతులకు రుణమాఫీ చేస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. మంగళవారం తిరుమలాయపాలెం(Thirumalayapalem) మండల పర్యటనలో ఉన్న ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి మాట్లాడుతూ.. రైతులు(Farmers) తీసుకొచ్చిన పత్తిలో కోత విధిస్తే సహించబోమని, వేబ్రిడ్జి కాటాలో తేడా వస్తే మిల్లు సీజ్ చేయిస్తామని హెచ్చరించారు. ఈ సంవత్సరం అధిక వర్షాల కారణంగా పత్తి రైతులు పంట నష్టపోయారని, రెండు లక్షల ఎకరాల్లో 20 టన్నుల పంట ఉత్పత్తి అవుతుందని అన్నారు. అలాగే తొమ్మిది సీసీఐ కొనుగోలు కేంద్రాలు(CCI Centers) ఏర్పాటు చేసామని, ఇందులో మద్దతు ధర ఇవ్వడంతో పాటు 12 శాతం ఉండే విధంగా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ఇది రైతుల పక్షపాత ప్రభుత్వమని, రైతుకు ఎక్కడ ఇబ్బంది కలగొద్దని విప్లవాత్మక మార్పులు చేసామని చెప్పారు.
దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇళ్లు..
ఇప్పటికే 18వేల కోట్ల రుణమాఫీ చేసామని, రుణమాఫీపై ప్రతిపక్షాలు(Opposition's) కారుకూతలు కూస్తున్నాయని మండిపడ్డారు. అర్హులైన రైతులందరికీ తల తాకట్టు పెట్టైన రుణమాఫీ చేస్తామని, డిసెంబర్ లోపే 13 వేల కోట్ల రుణమాఫీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అంతేగాక అర్హులైన పేదలకు అందరికీ ఇందిరమ్మ ఇళ్ళు దీపావళి కానుక(Diwali Gift)గా ఇవ్వబోతున్నామని, ఆనాడు రాజశేఖర్ రెడ్డి(YSR) ఉన్నప్పుడు ఎలా ఇల్లు కట్టిచారో ఇప్పుడు కూడా అలాగే ఇస్తామని స్పష్టం చేశారు. ఇక సన్నరకం వడ్లకు 500 బోనస్(Bonus) ఇస్తామని చెప్పినట్టే ఇవ్వబోతున్నామని తెలిపారు. ధాన్యంలో తేమ శాతం కోసం ఎండబెట్టుకుని తీసుకుపోవాలని, సీసీఐ నామ్స్ ప్రకారం రైతులు పత్తిని తీసుకురావాలని సూచించారు. అలాగే కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు(Problems) రెవెన్యూ అధికారుల(Revenue Officers) దృష్టికి తీసుకురావాలని, రైతులు పిర్యాదు(Complaint) చేస్తే అధికారుల మీద చర్యలు(Action) తీసుకుంటామని చెప్పారు. ఒక్క కేజీ తరుగు తీయొద్దని, రైతులకు ఎక్కడ నష్టం కలగకుండా చూడాలని, రైతుల అవసరం, కష్టాలు తీర్చాల్సిన బాధ్యత మనపై ఉందని పొంగులేటి అన్నారు.