- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడు రోజుల గ్యాప్‌లో రెండు మీటింగ్స్.. హీటెక్కనున్న స్టేట్ పాలిటిక్స్!
ముందస్తు ఊహాగానాల నేపథ్యంలో స్టేట్‌లో పొలిటికల్ హీట్ పెరిగింది. బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా రాజకీయాలు చేస్తున్నాయి. మూడు రోజుల గ్యాప్‌లో పరేడ్ గ్రౌండ్స్ వేదికగా బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని జన సమీకరణకు ప్లాన్ వేస్తున్నాయి. తెలంగాణకు వచ్చిన తర్వాత పీఎం, సచివాలయం ప్రారంభించిన తర్వాత సీఎం నిర్వహించే ఈ మీటింగ్స్‌లో ఇద్దరి స్పీచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: సెక్రటేరియెట్‌ను ప్రారంభించిన తర్వాత కేసీఆర్ సర్కార్‌ను డిసాల్వ్ చేసే చేస్తారని పొలిటికల్ సర్కిళ్లలో చర్చ జరుగుతున్నది. దీంతో బీజేపీ సైతం అలర్ట్ అయింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సంక్రాంతి సందర్భంగా వందే భారత్ రైలును ప్రారంభించింది. ఆ ప్రోగ్రామ్‌కు ప్రధాని మోడీ హాజరు కావాల్సి ఉన్నా.. వాయిదా పడింది.
ఆ తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల ఇనాగ్రేషన్, అలాగే పలు జాతీయ రహదారులను ప్రారంభోత్సవానికి ఫిబ్రవరి 13న ప్రధాని మోడీ టూర్ ఫిక్స్ అయింది. దీంతో ప్రధానమంత్రి అధికారిక కార్యక్రమాలను రాజకీయంగా ఉపయోగించుకోవాలని బీజేపీ డిసైడ్ అయినట్లు తెలుస్తున్నది. మోడీ సభను సీరియస్‌గా తీసుకొని సక్సెస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నది. తెలంగాణపై కేంద్రం ఫోకస్ ఎంతలా ఉందనే ఇంపాక్ట్‌ను ప్రజలకు తెలియజేయాలని చూస్తున్నది. పరేడ్ గ్రౌండ్లో సభ నిర్వహించి భారీగా జన సమీకరణ చేయాలని చూస్తున్నది.
గులాబీ వ్యూహం..
పీఎం మోడీ వెళ్లిన వచ్చిన మూడు రోజుల తర్వాత సభకు బీఆర్ఎస్ ప్లాన్ చేసుకున్నది. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ సెక్రటేరియెట్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో సభ నిర్వహించనున్నారు. మోడీ సభను మించేలా దీన్ని నిర్వహించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే పలువురు జాతీయ నేతలకు ఆహ్వానం పంపించినట్లు తెలిసింది. కాగా, కేసీఆర్, మోడీ ప్రసంగంపై రాజకీయంగా సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
Also Read...