ఎమ్మెల్యే కారు ప్రమాదంలో ఇద్దరు అరెస్ట్

by Sathputhe Rajesh |
ఎమ్మెల్యే కారు ప్రమాదంలో ఇద్దరు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్‌లో కారు ప్రమాదానికి కారణమైన మీర్జాను పోలీసులు అరెస్ట్ చేశారు. మీర్జాను జూబ్లీహిల్స్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీర్జాతో పాటు అతడి కుమారుడిని కూడా అరెస్ట్ చేశారు. ప్రమాదానికి గురైన కారుపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్ ఉండటంతో వివాదాస్పదంగా మారింది. కారు నడిపింది తన కజిన్ మీర్జా కుమారుడని, ఈ ప్రమాదంలో చిన్నారి మృతి చెందడం బాధాకరమని ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందగా.. గాయాలపాలైన ముగ్గురు మహిళలు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Next Story