- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు అరెస్ట్
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: నేరాలకు పాల్పడి ధీర్ఘకాలంగా తప్పించుకు తిరుగుతున్న ఇద్దరిని సీఐడీ ప్రత్యేక బృందాలు పట్టుకున్నాయి. జీ. పరమేశ్వర్ అనే వ్యక్తి పదిహేనేళ్ల క్రితం స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌ను మోసం చేసి రూ.19 లక్షలు కొట్టేశాడు. ఈ మేరకు జైనూర్ పోలీసులు కేసులు నమోదు చేసారు. ఆ తరువాత కేసు కరీంనగర్ సీఐడీకి బదిలీ అయింది. కాగా పరమేశ్వర్ 2010 నుంచి పరారీలో ఉన్నాడు.
దాంతో అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. ఎస్సై శ్రీనివాస్ కానిస్టేబుల్లు మల్లయ్య, సారంగపాణితో కలిసి గాలింపు చేపట్టి మహారాష్ట్ర చంద్రగిరి జిల్లా జీవతీ ప్రాంతంలో అరెస్ట్ చేసారు. మరో కేసులో ప్రముఖ కంపెనీల డేటా తస్కరించి ఇతరులకు అమ్మిన కడప జిల్లా పొద్దుటూరు నివాసి కోట రాజేష్‌ను అరెస్ట్ చేసారు. ఏడాదిగా పరారీలో ఉన్న ఇతన్ని సీఐడి ఏఎస్‌ఐ యూనిస్ ఖాన్, హెడ్ కానిస్టేబుల్ మన్నన్‌తో కలిసి అరెస్ట్ చేసారు. నిందితులను అరెస్ట్ చేసిన సిబ్బందికి రివార్డులు ఇవ్వనున్నట్టు సీఐడీ ఛీఫ్ మహేష్ భగవత్ చెప్పారు.