- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రేవంత్ రెడ్డి కవిత మధ్య ట్విట్టర్ వార్! పేలిన మాటల తూటాలు
దిశ, డైనమిక్ బ్యూరో: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి మధ్య ట్విట్టర్ వార్ నడిచింది. దీక్షా దివస్ సందర్భంగా ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. తొలుత దీక్ష దివస్ సందర్భంగా కవిత నిన్న ఓ ట్వీట్ చేసింది. "కోట్లాది ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు, 'తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో' అంటూ, ప్రాణాలను పణంగా పెట్టి, సమైక్య పాలకుల నిర్బంధాలను ఛేదించి, సిద్దిపేట కేంద్రంగా ఉద్యమ వీరుడు కేసీఆర్ గారు ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించిన చారిత్రక రోజు... నవంబర్ 29, దీక్షా దివాస్" అంటూ ట్వీట్ పోస్ట్ చేసింది. ఈ ట్వీట్ పై తెలంగాణ కాంగ్రెస్ స్పందిస్తూ ఇది దీక్ష దివాస్ కాదు దగా దివాస్ అని ఆరోపణ చేసింది.దొంగ దీక్షతో ఉద్వేగాలను రెచ్చగొట్టి, యువతను బలిదానాల వైపు నడిపించిన దుర్దినం. దొంగ దీక్ష నాటకమాడిన మీ నాయన సీఎం కుర్చీ ఎక్కిండు. చిత్తశుద్ధితో ఉద్యమం చేసి, బలిదానాలు చేసిన బిడ్డలకు కనసం గుర్తింపే లేకపాయే అంటూ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్ లో కవితను ట్యాగ్ చేస్తూ ఉద్యమ ద్రోహి కేసీఆర్ అనే యాష్ ట్యాగ్ ఇచ్చింది.
దీనిపై స్పందించిన కవిత కాంగ్రెస్ పై విరుచుకుపడింది. 'తెలంగాణ ద్రోహులకు అడ్డా కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ బిడ్డల బలిదానాలకు కారణమే కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి వెనక్కి తగ్గి రాష్ట్ర ఏర్పాటుపై కాలయాపన చేసినందుకే వేలాది మంది తెలంగాణ యువకులు రాష్ట్ర సాధన కోసం బలిదానం చేశారు. ప్రజా పోరాటాలను అపహాస్యం చేయడం అలవాటుగా మార్చుకున్న కాంగ్రెస్ పార్టీని దేశమంతా ప్రజలు తిరస్కరిస్తున్నా బుద్ధి రావడం లేదు. తెలంగాణ కోసం పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం ప్రారంభించిన కేసీఆర్ గారు, దేశంలోని 39 పార్టీల మద్దతు కూడగట్టి, యూపీఏ ప్రభుత్వం మెడలు వంచి, తెలంగాణ రాష్ట్రం తెచ్చారు. తెలంగాణ కోసం జరిగిన ప్రతి బలిదానం కాంగ్రెస్ పార్టీ చేసిన హత్యే. సొంత నియోజకవర్గం అమేథిలో గెలుస్తానని నమ్మకం లేక కేరళ రాష్ట్రం వాయనాడ్ వెళ్లారు మీ నాయకుడు రాహుల్ గాంధీ.. ఎంపీగా ఓడిపోయినా అక్కడే స్థానిక సంస్థల కోటాలో మీ పార్టీ పైనే ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచా' అంటూ కౌంటర్ ఇచ్చారు.
కవిత ట్వీట్లపై రియాక్ట్ అయిన రేవంత్ రెడ్డి 'వంటావార్పులో పప్పన్నం తిన్నందుకే.. బతుకమ్మ ఆడినందుకే.. బోనం కుండలు ఎత్తినందుకే.. మీ ఇంటిల్లపాది సకల పదవుల, భోగభాగ్యాలు అనుభవిస్తుంటే.. తెలంగాణ కోసం చిరునవ్వుతో ప్రాణాలు వదిలిన శ్రీకాంతా చారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్యల త్యాగాలనేమనాలి!? అమరవీరుల బలిదానాలకు 'చంద్ర'గ్రహణంలా దాపురించిన మీ కుటుంబానికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హతెక్కడిది? అందుకే.. త్యాగాలు చేసిందెవరు.. భోగాలు అనుభవిస్తోందెవరని యావత్ తెలంగాణ ఘోషిస్తోంది. అధికార మదంతో మూసుకుపోయిన మీ కళ్లకు, చెవులకు అవి కనబడవు వినబడవు' అంటూ అంతే స్థాయిలో స్ట్రాంగ్ రిప్లే ఇచ్చారు. నేతల మధ్య ట్విట్టర్ వార్ పై నెటిజన్లు సైతం అంతే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో దీక్ష దివస్ సందర్భంగా ట్విట్టర్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ట్వీట్ల వార్ పీక్స్ కు చేరుకుంది.
వంటావార్పులో పప్పన్నం తిన్నందుకే… బతుకమ్మ ఆడినందుకే…
— Revanth Reddy (@revanth_anumula) November 29, 2022
బోనం కుండలు ఎత్తినందుకే …
మీ ఇంటిల్లపాది సకల పదవుల, భోగభాగ్యాలు అనుభవిస్తుంటే… తెలంగాణ కోసం చిరునవ్వుతో ప్రాణాలు వదిలిన శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్యల త్యాగాలనేమనాలి!?
1/2 https://t.co/jceByOFNCc
Read More......