- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్, బండి సంజయ్ మధ్య ట్వీట్ వార్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన T-బీజేపీ చీఫ్!
by Satheesh |
X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రస్తుతం బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయ వ్యవహారం సాగుతున్న వేళ ఉగాది పంచాంగంపై బీజేపీ స్టేట్ చీప్ బండి సంజయ్, మంత్రి కేటీఆర్ మధ్య ట్వీట్ వార్ నడిచింది. మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ కు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఉగాది సందర్భంగా 'ఆదాయం: అదానీకి, వ్యయం: జనానికి, బ్యాంకులకు. అవమానం: నెహ్రూకి, రాజపూజ్యం: గుజరాతీ గుంపుకి, బస్, బభ్రాజీమానం భజగోవిందం దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనికి బండి సంజయ్ కౌంటర్ ఇస్తూ 'ఆదాయం: కల్వకుంట్ల కుటుంబానికి, వ్యయం : తెలంగాణ రాష్ట్రానికి. అవమానం : ఉద్యమ వీరులకు, అమరుల త్యాగాలకు, రాజపూజ్యం: ఉద్యమ ద్రోహులకు, దొంగలకు. తుస్.. పిట్టల దొర, తుపాకి చంద్రుల గడీల పంచాతీ లెక్క తేలుడే తరువాయి.. పతనం ఇగ షురువాయే' అంటూ సెటైరికల్ కౌంటర్ ఇచ్చారు.
Advertisement
Next Story