- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జర్నలిజాన్ని రక్షించండి.. గవర్నర్‌కు టీయుడబ్ల్యూజే వినతి
దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో జర్నలిజాన్ని కాపాడాలనే నినాదంతో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) పిలుపు మేరకు గురువారం టీయూడబ్ల్యూజే హైదరాబాద్‌లో ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా దేశంలో పథకం ప్రకారం నిర్వీర్యమవుతున్న జర్నలిజాన్ని పరిరక్షించడంతో పాటు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేస్తూ టీయుడబ్ల్యూజే ప్రతినిధి బృందం రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించడంతో పాటు హైదరాబాద్‌లోని కవాడిగుడలో సెంట్రల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) తెలంగాణ రీజియన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి పీఐబీ జాయింట్ డైరెక్టర్ వి.బాలకృష్ణకు వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా ఐజేయూ అధ్యక్షులు కే.శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీల నేతృత్వంలో ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పాలకులకు లోంగని జర్నలిస్టులు, మీడియా సంస్థలపై కేంద్రం మరియు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష్య సాధింపు ధోరణులకు పాల్పడుతోందన్నారు.
బడా కార్పొరేట్ సంస్థల ఆధిపత్యం నుంచి మీడియాను రక్షించాలని సంపాదకుల, ఇండిపెండెంట్ జర్నలిస్టుల స్వేచ్ఛను కాపాడలని కోరారు. జర్నలిస్టులపై క్రూరమైన చట్టాలను ప్రయోగిస్తూ ఇబ్బందుల పాలు చేయాలని చూడటం, డిజిటల్ మీడియాపై ఆంక్షలు సరికాదన్నారు. జర్నలిస్టులకు రైల్వే ప్రయాణాల్లో రాయితీ సౌకర్యాన్ని పునరుద్ధరించడంతో పాటు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ మీడియా అక్రెడిటేషన్ కమిటీలలో గుర్తింపు పొందిన జర్నలిస్టు సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. తమ సమస్యలపై గవర్నర్ సానుకూలంగా స్పందించిందని యూనియన్ నేతలు చెప్పారు. గవర్నర్ ను కలిసిన ప్రతినిధి బృందంలో ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కే.సత్యనారాయణ, టీయుడబ్ల్యూజే ఉపప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, కోశాధికారి కే.మహిపాల్ రెడ్డి, హెచ్ యూజే అధ్యక్ష, కార్యదర్శులు శిగా శంకర్ గౌడ్, అబ్దుల్ హమీద్ షౌకత్ లు ఉన్నారు.
ఇవి కూడా చదవండి : అండగా ఉంటాం.. అధైర్య పడవద్దు : సీఎం కేసీఆర్