రైతులకు గుడ్ న్యూస్.. క్వింటాల్ పసుపు ధర ఎంతో తెలుసా?

by samatah |   ( Updated:2023-08-11 05:45:43.0  )
రైతులకు గుడ్ న్యూస్.. క్వింటాల్ పసుపు ధర ఎంతో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : రైతులకు తీపికబురు అందింది. పసుపు ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.రంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పసుపు ధర క్వింటాల్ 13 వేలకు చేరింది. గత వారంలో ఆరు వేలు పలికిన ధర ఒక్కసారిగా 13 వేలకు చేరడంతో రైతుల ఆనందం అంతా ఇంతా కాదు. అంతర్జాతీయంగా పసుపు డిమాండ్ పెరగడంతో పాటు పసుపు నిల్వలు గతం కంటే తగ్గడంతో వ్యవసాయ మార్కెట్లో మంచి ధరలు దక్కుతుందంటున్నారు రైతులు. మరోవైపు.. రాబోయే రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు తెలిపాయి.

Advertisement

Next Story