- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఓటర్లకు గుడ్ న్యూస్ చెప్పిన TSRTC ఎండీ సజ్జనార్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీనియర్ ఐపీఎస్ అధికారి, TSRTC MD వీసీ సజ్జనార్ సార్వత్రిక ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొండాపూర్ చిరాక్ పబ్లిక్ స్కూల్ లోని 375వ పోలింగ్ బూత్ లో సోమవారం తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమానంగా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించిదని అన్నారు. భవితకు భరోసానిచ్చే ఓటును నిస్వార్థంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకుని, సమర్థ నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లందరు పాల్గొని తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని వెల్లడించారు. అందరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయాలని తెలిపారు.
ముందు ఓటు వేసిన తర్వాతే ఇతర పనులు చూసుకోవాలని చెప్పారు. ప్రతి పౌరుడు ఓటు వేయడాన్ని సామాజిక బాధ్యతగా భావించి పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఓటేసుందుకు సొంతూళ్లకు వెళ్లేవారి కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందని చెప్పారు. రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో 1.50 కోట్ల మంది బస్సుల్లో రాకపోకలు సాగించారని తెలిపారు. తిరుగుప్రయాణంలోనూ అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు.