TSPSC సంచలన నిర్ణయం.. ఆ 37 మంది ఎలాంటి పరీక్ష రాయకుండా డీబార్!

by Satheesh |   ( Updated:2023-05-30 12:40:40.0  )
TSPSC సంచలన నిర్ణయం.. ఆ 37 మంది ఎలాంటి పరీక్ష రాయకుండా డీబార్!
X

దిశ, వెబ్‌డెస్క్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కట్టుదిట్టమైన భద్రత ఉండే టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్‌లను బోర్డులో పని చేస్తోన్న ఉద్యోగుల ద్వారా కొనుగోలు చేసి కొందరు అభ్యర్థులు పరీక్షలు చేశారు. ఇక, బోర్డు ఫిర్యాదు మేరకు ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న స్పెషల్ ఇన్వె్స్టిగేషన్ టీమ్ (సిట్) ఇప్పటికే పేపర్ కొనుగోలు చేసి పరీక్ష రాసిన 37 మంది అభ్యర్థులను అరెస్ట్ చేసింది.

ఇదిలా ఉండగా, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్ అయిన అభ్యర్థుల విషయంలో టీఎస్పీఎస్సీ బోర్డు సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పేపర్ లీకేజీతో ప్రమేయమున్న ఆ 37 మంది అభ్యర్థులను డీబార్ చేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపై ఆ 37 మంది అభ్యర్థులు టీఎస్పీఎస్సీ నిర్వహించే ఎలాంటి పరీక్షలు రాయకుండా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే, బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆ 37 మంది అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ నోటీసులు జారీ చేసింది. కాగా, పరీక్ష పేపర్ల లీకేజీ కేసులో అరెస్ట్ అయిన అభ్యర్థుల విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవాలనే చర్యలో భాగంగానే టీఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed