TS EAPCET-2024: టీఎస్ ఎంసెట్ రాసే విద్యార్థులకు బిగ్ అలర్ట్.. అమ్మాయిలు ఆ పని చేస్తే పరీక్షా కేంద్రం నుంచి బయటకే

by Disha Web Desk 1 |
TS EAPCET-2024: టీఎస్ ఎంసెట్ రాసే విద్యార్థులకు బిగ్ అలర్ట్.. అమ్మాయిలు ఆ పని చేస్తే పరీక్షా కేంద్రం నుంచి బయటకే
X

దిశ, వెబ్‌డెస్క్: TS EAPCET (టీఎస్ ఎంసెట్) రాసే విద్యార్థులకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కీలక సూచన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ ఎంసెట్ ప‌రీక్షను మే 7 నుంచి 11 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో నిర్వహించ‌నున్నారు. అయితే, అందుకు సంబంధించి ఇప్పటికే అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇవాళ రాష్ట్ర ఉన్నత విద్యామండ‌లి చైర్మన్ ఆర్.లింబాద్రి మీడియాతో మాట్లాడుతూ.. టీఎస్ ఎంసెట్ ప‌రీక్షకు రాసేందుకు 3.54 ల‌క్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేష‌న్ చేసుకున్నారని వెల్లడించారు. ప‌రీక్ష జ‌రిగే రోజుల్లో 90 నిమిషాల ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని తెలిపారు.

వాట‌ర్ బాటిల్స్, ఎల‌క్ట్రానిక్ గ్యాడ్జెట్లను అనుమ‌తించ‌బోమని వెల్లడించారు. ముఖ్యంగా అమ్మాయిలు చేతుల‌కు గోరింటాకు, టాటూలు వంటి వాటిని పెట్టుకోకూడ‌ద‌ని సూచించారు. పైన పేర్కొ్న్న నిబంధ‌న‌ల‌ను అందురూ తప్పనిసరిగా పాటించాలని లేని పక్షంలో పరీక్షా కేంద్రంలో అనుమతి ఉండదని తెలిపారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 2,54,543 మంది, అగ్రికల్చర్ అండ్ ఫార్మా విభాగంలో1,00,260 మంది చొప్పున విద్యార్థులు పరీక్ష రాసేందుకు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. TS EAPCET (టీఎస్ ఎంసెట్) ప‌రీక్షను 21 జోన్లలో నిర్వహిస్తుండ‌గా, తెలంగాణ‌లో 16, ఏపీలో 5 జోన్లను ఏర్పాటు చేశామ‌ని తెలపారు. అగ్రిక‌ల్చర్ అండ్ ఫార్మా విభాగానికి 135, ఇంజినీరింగ్‌కు విభాగానికి 166 కేంద్రాల్లో ప‌రీక్షలు నిర్వహిస్తున్నామని లింబాద్రి తెలిపారు.

Next Story