- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TRS కారు గుర్తు లాగే మరో 8 గుర్తులు.. నేడు హైకోర్టుకు గులాబీ నేతలు
దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు ఉప ఎన్నికల్లో కారు గుర్తును పోలిన 8 గుర్తులను తొలగించాలని టీఆర్‌ఎస్ నాయకులు హైకోర్టును సోమవారం ఆశ్రయించనున్నారు. కారు గుర్తును పోలిన కెమెరా, చపాతి రోలర్, డోలీ, రోడ్డు రోలర్, సోప్ డిష్, టెలీవిజన్, కుట్టుమిషన్, ఓడ గుర్తులు ఎవరికీ కేటాయించొద్దని, ఫ్రీ సింబల్స్ నుంచి తొలగించాలని ఈ నెల 9న ఈసీకి టీఆర్ఎస్ నేతలు వినతపత్రం అందజేశారు. అయితే ఎన్నికలు సమీపిస్తుండటం, ఈసీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. శనివారం హౌజ్ మోషన్ పిటిషన్ వేశారు. అయితే, హైకోర్టు సూచన మేరకు సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ వేస్తున్నట్లు టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ భరత్ కుమార్ తెలిపారు. గత శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తును పోలిన సింబల్స్ వల్ల ఓటర్లు ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఓట్లు పడటంతో ఓడిపోయామని భావించిన టీఆర్ఎస్ ఈసారి మునుగోడు బైపోల్‌లో ఎలాంటి నష్టం పార్టీకి జరుగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టింది.