- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్పీడ్ పెంచిన KCR.. మహారాష్ట్ర BRS నేతలకు స్పెషల్ ట్రైనింగ్!
దిశ, తెలంగాణ బ్యూరో: మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ భవన్‌లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మహారాష్ట్రకు చెందిన నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రాజకీయాలపై సుధీర్ఘంగా చర్చించారు. చేపట్టాల్సిన అంశాలపైన నేతల అభిప్రాయాలను తీసుకున్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రైతులే లక్ష్యంగా బీఆర్ఎస్‌ను పటిష్టం చేయాలన్నారు. మే 10వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు సంస్థాగత నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు. 288 నియోజకవర్గాల్లో పార్టీ విస్తరణపై స్థానిక నేతలు దృష్టిపెట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహారాష్ట్రలో చాలామంది నేతలు పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారన్నారు. వారందరిని పార్టీలోకి ఆహ్వానించాలని, ప్రతి కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. స్థానిక సంస్థల్లో గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపు నిచ్చారు.