- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీలో తీవ్ర విషాదం.! క్రికెట్ ఆడుతుండగా 'విద్యుదాఘాతంతో' విద్యార్ధి మృతి
దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతుండగా.. విద్యుత్ స్తంభం తగలడంతో విద్యుత్ షాక్ కి గురై ఏడో తరగతి విద్యార్ధి (13) ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఢిల్లీలోని రన్ హోలా ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై డీఎస్పీ స్పందిస్తూ.. శనివారం మధ్యాహ్నం 1.27 గంటల సమయంలో తమకు పీసీఆర్ కాల్ వచ్చిందని, దాంతో వెంటనే తమ బృందం అక్కడికి వెళ్లిందని తెలిపారు. తర్వాత విద్యుత్ షాక్ కి గురైన బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అయితే బాలుడు తన మిత్రులతో కలిసి కోట్ల విహార్ ఫేజ్-2 లోని గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతుండగా..అక్కడ దాని పక్కనే గోశాలకు విద్యుత్ సరఫరా అందించేందుకు ఏర్పాటు చేసిన ఒక ఐరన్ పోల్ నుంచి విద్యుత్ ప్రసరిస్తుండగా, బంతి కోసం అక్కడికి వెళ్లిన బాలుడు ఐరన్ పోల్ ను పట్టుకోవటంతోనే విద్యుత్ షాక్ కి గురయ్యాడని, ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
మైదానానికి ఆడుకోవడానికి వెళ్లిన తమ కుమారుడు శవమై ఇంటికి తిరిగిరావడంతో.. విద్యార్థి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనలో గోశాల నిర్వాహకులు, విద్యుత్ శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లి అనితా దేవీ డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి విద్యార్థి తల్లి మాట్లాడుతూ.. "నా కుమారుడు ఏడవ తరగతి చదువుతున్నాడు. శనివారం నాడు తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు గోశాల వద్ద నున్న గ్రౌండ్ కు వెళ్ళాడు. అక్కడ ఐరన్ పోల్ ను పట్టుకొని విద్యుత్ షాక్ కి గురై తన ప్రాణాలను విడిచాడు. అక్కడ అదే గ్రౌండ్ లో చాలా మంది పిల్లలు ఆడేందుకు వెళ్తుంటారు. అయితే అక్కడ చాలా మంది ఉన్నప్పటికీ.. తన కుమారుడిని రక్షించడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేకపోయారు. ఏ ఒక్కరూ కూడా గోశాల సభ్యులను విద్యుత్ సరఫరా నిలిపి వెయ్యాలని అడగలేకపోయారు. మీక్కూడా ఇలా జరగవచ్చు అందువల్ల గోశాల నిర్వాహకులపై, విద్యుత్ శాఖ అధికారులపై తక్షణమే కఠిన చర్యలకు ఉపక్రమించాలని" మృతుడి తల్లి అనితా దేవీ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.