- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Traffic Update: హైదరాబాద్ లో పలుచోట్ల స్తంభించిన ట్రాఫిక్
దిశ, డైనమిక్ బ్యూరో: పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లు వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తుండటంతో హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. రోడ్లపై వాహానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు స్కాలర్ షిప్ లు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. ఏబీవీపి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేస్తుండటంతో విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో విమాన ప్రయాణికులు గంధర గోళానికి గురవుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసన కారులకు సర్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇదే విషయంపై నిజాం కళాశాల వద్ద విద్యార్ధులు భారీ ఆందోళన నిర్వహిస్తున్నారు. స్కాలర్ షిప్ లను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై చేరి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో నిజాం కళాశాల పరిధిలో కూడా భారీ ట్రాఫిక్ ఏర్పడింది. ఆ రూట్ లో వెళ్లే వాహానదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పోలీసులు రోడ్లపై నిలిచిపోయిన వాహానాలను దారి మళ్లిస్తూ.. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.