HYD: రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

by GSrikanth |
HYD: రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ రేపు హైదరాబాద్‌లో పలుచోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరుగబోయే ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు హాజరు కాబోతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రేవంత్ బహిరంగ లేఖ రాశారు. ఏర్పడబోయే ఇందిరమ్మ రాజ్యాన్ని చూడ్డాటానికి అందరూ హాజరు కావాలని కోరారు. కాగా, ఇప్పటికే అధికారులు ఎల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీఐపీల కోసం 150 సీట్లతో వేదిక సిద్ధం చేయనున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 500 మందితో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు.

Advertisement

Next Story

Most Viewed