TSPSC పేపర్ల లీక్ వెనుక కేటీఆర్ PA హస్తం: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-03-18 13:11:35.0  )
Revanth Reddy will not Participate in Munugode Padayatra Due to Covid Symptoms
X

దిశ, వెబ్‌డెస్క్: టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం తెలంగాణ‌లో తీవ్ర దుమారం రేపుతోన్న వేళ.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఎస్‌‌పీఎస్సీ పేపర్ల లీక్ ఘటన వెనుక మంత్రి కేటీఆర్ పీఏ పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పీఏ సొంత గ్రామంలో 100 మందికి 100 పైగా మార్కులు వచ్చాయని.. కావున దీనిపై కూడా విచారణ చేపట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ స్టేట్ పబ్లిక సర్వీస్ కమిషన్ పేపర్ల లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారిన వేళ తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీ వెనుక అధికార బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉందని ఆరోపణలు చేస్తోన్న వేళ.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

Read more:

బ్రేకింగ్: మీడియాపై మంత్రి కేటీఆర్ సీరియస్

పేపర్ లీకేజీకి కేటీఆరే కారణమంటూ.. రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

Advertisement

Next Story