మోడీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.. బీజేపీని తరిమికొడదాం: రేవంత్ రెడ్డి

by Satheesh |   ( Updated:2023-09-19 10:02:23.0  )
మోడీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.. బీజేపీని తరిమికొడదాం: రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ మొదటి రోజు సమావేశాల నేపథ్యంలో నిన్న ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల విభజనపై ప్రసంగించారు. తెలంగాణ, ఏపీ విడిపోవడం వల్ల ప్రజలు సంబరాలు చేసుకోలేదని అన్నారు. తెలంగాణ, ఏపీ విభజన సరిగ్గా జరగలేదని కాంగ్రెస్‌ను పరోక్షంగా విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ ట్విట్టర్ వేదికగా తెలుగులో స్పందించారు. తెలంగాణ అమరులను, వారి త్యాగాలను అవహేళన చేస్తూ ప్రధాని మోడీ మాట్లాడటం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానపరచడమేనని పేర్కొన్నారు. పీఎం తెలంగాణకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ట్వీట్‌తో జోడిస్తూ.. తెలంగాణ త్యాగాల విలువ, పోరాట స్ఫూర్తిని కించపరిచేలా మోడీ మాట్లాడటం ఘోరమన్నారు. రాష్ట్రం ఏర్పాటు చేసిన పార్టీగా తెలంగాణ గుండె చప్పుడు తెలుసుకాబట్టే రాహుల్ గాంధీ మోడీ వ్యాఖ్యలను తిప్పికొట్టారని తెలిపారు. బీజేపీ పార్టీని తరిమి కొడదామని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed