- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని నిరూపిస్తా.. మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ సవాల్
by Javid Pasha |
X
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడంలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు ఇస్తోంది సింగిల్ ఫేజ్ కరెంటే తప్ప ట్రిపుల్ ఫేజ్ కరెంట్ కాదని అన్నారు. కావాలంటే నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, మరీ రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని నిరూపించడానికి మంత్రి కేటీఆర్ సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు.
తాము గృహావసరాల కోసమే 24 గంటల కరెంట్ ఇస్తున్నామని, వ్యవసాయానికి అవసరమైన మేరకే విద్యుత్ ఇస్తున్నామని సాక్షాత్తు ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావే చెప్పారని రేవంత్ అన్నారు. తాను అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు చెప్పింది కూడా ఇదే విషయమని అన్నారు. కేసీఆర్ పాలనలో ఇప్పటివరకు ఎంత కరెంట్ ఇచ్చారో తెలుసుకోవడానికి ఉపయోగపడే లాక్ బుక్స్ ను రాష్ట్ర ప్రభుత్వం లేకుండా చేసిందని ఆరోపించారు.
Advertisement
Next Story