బీఆర్ఎస్, బీజేపీ కలిసొచ్చినా ఏం చేయలేరు.. మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్

by Gantepaka Srikanth |
బీఆర్ఎస్, బీజేపీ కలిసొచ్చినా ఏం చేయలేరు.. మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘తెలంగాణ మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం. కాంగ్రెస్(Congress) నమ్మిన ప్రజలను మోసపోయామని గ్రహించారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి బంపర్ విక్టరీ సాధిస్తాం. ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానం అవసరం లేదు. ఒక్కో బీఆర్ఎస్ కార్యకర్త ఒక్కో కేసీఆర్ కావాలని.. అప్పుడు మనల్ని ఎవరూ ఆపలేరు’ అని ఫామ్‌హౌజ్‌లో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. తాజాగా కేసీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) స్పందించారు. కేసీఆర్(KCR) పగటి కలలు కనడం మానేయాలని సూచించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్(BRS) దుకాణం ఏనాడో బంద్ అయిందని చెప్పారు.

బీఆర్ఎస్ సృష్టించిన ఆర్థిక విధ్వంస పునాదులపై రాష్ట్రాన్ని పునర్:నిర్మిస్తున్నామని అన్నారు. రైజింగ్ తెలంగాణ(Rising Telangana) అనే నినాదంతో ముందుకు వెళుతున్నామని వెల్లడించారు. గత పదేళ్లతో పోలిస్తే.. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు వెళుతోందని అన్నారు. ఎప్పుడో ఒకసారి అమావాస్య చంద్రుడిలా ఫామ్‌హౌజ్(KCR Farmhouse) నుంచి బయటకొచ్చి.. కేసీఆర్(KCR) ప్రగల్బాలు పలికి పోతున్నాడని విమర్శించారు. ఎన్ని కోతలు కోసినా బీఆర్ఎస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ(BJP)తో కలిసి వచ్చినా కాంగ్రెస్ గెలుపును ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు.

Next Story

Most Viewed