- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బరిలోకి మోడీ, షా, నడ్డా.. ఎన్నికల వేళ టీ- బీజేపీ మరో భారీ స్కెచ్..!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ అసెంబ్లీ ఎన్నికల కసరత్తు వేగం పెంచింది. ఇవాళ 52 మందితో అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిన కాషాయం పార్టీ.. ఇకపై ప్రచారంలోనూ దూకుడు పెంచనుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు దీటుగా దసరా తర్వాత ప్రచారం హోరెత్తించేలా ప్లాన్ చేసింది. బీజేపీ అగ్రనేతలైన ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఎన్నికల రంగంలోకి దింపనుంది. 27, 28, 29, 31వ తేదీల్లో బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో విస్తృత ప్రచారం నిర్వహించున్నారు.
ప్రధాని మోడీ ఐదుకు పైగా బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. ఈ నెల 27వ తేదీన కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. అమిత్ షా 15కు పైగా బహిరంగ సభల్లో పాల్గొనున్నట్లు సమాచారం. ఇప్పటికే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అసోం సీఎం హిమాంత్ బిస్వా శర్మ షెడ్యూల్ ఖరారు అయ్యింది. 28, 29 తేదీల్లో అసోం సీఎం హిమాంత్ బిస్వా శర్మ ప్రచారంలో పాల్గొననున్నారు. 31వ తేదీన యూపీ సీఎం సీఎం యోగి ఆదిత్యనాథ్ బరిలోకి దిగనున్నారు.
వీరితో పాటు కర్నాటక మాజీ సీఎం యడియూరప్ప, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, చిరాగ్ పాశ్వాన్, అర్జున్ ముండా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనన్నారు. ప్రచారం ముమ్మరంగా నిర్వహించేందుకు బీజేపీ హెలికాప్టర్లు సైతం బుక్ చేసుకున్నారు. కాగా, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో కాంగ్రెస్, సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులతో బీఆర్ఎస్ జోరుగా ప్రచారం నిర్వహించింది. ఇక, ప్రచార బరిలోకి బీజేపీ అగ్రనేతలు బరిలోకి దిగుతుండటంతో రాష్ట్ర రాజకీయం మరింత వేడెక్కనుంది.