రేవ్ పార్టీలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన టాలీవుడ్ నటులు!.. బెంగళూరు ఘటనతో మరోసారి సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు?

by Prasad Jukanti |
రేవ్ పార్టీలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన టాలీవుడ్ నటులు!.. బెంగళూరు ఘటనతో మరోసారి సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు?
X

దిశ, డైనమిక్ బ్యూరో : బెంగళూరు శివారులో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఎలక్ట్రానికి సిటీ సమీపంలోని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి చెందిన ఫామ్‌హౌస్‌లో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత బర్త్ డే వేడుకల పేరుతో పెద్దఎత్తున రేవ్ పార్టీ నిర్వహిస్తుండగా సీసీబీ పోలీసులు దాడులు చేశారు. పార్టీలో పలువురు రాజకీయ నాయకులు, సినీతారలు, మోడళ్లు పాల్గొన్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు సినీ, రాజకీయ ప్రముఖులకు చెందిన బంధువులు పట్టుబడినట్లు సమాచారం. పార్టీకి హాజరైన ఆంధ్రా, బెంగళూరుకు చెందిన సుమారు 100 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా వారిలో 25 మందికిపైగా యువతులు ఉన్నట్లు తెలుస్తోంది. రేవ్ పార్టీ కోసం యువతీ యువకులను విమానంలో తరలించినట్లు సమాచారం. ఫామ్‌హౌస్ వద్ద 15కు పైగా విలువైన కార్లను పోలీసులు సీజ్ చేశారు. వాటిలో ఓ కారులో ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యేకు పేరున్న స్టిక్కర్ ఉండటం రాజకీయ వర్గాల్లో దుమారంగా మారింది. ఈ పార్టీలో మందుతోపాటు పెద్దఎత్తున ఎండీఎంఏ, కొకైన్ వంటి మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న బెంగళూరు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

నాకు సంబంధం లేదు : నటి హేమ

రేవ్ పార్టీకి తాను హాజరైనట్లు కన్నడ మీడియాతోపాటు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో నటి హేమ స్పందించారు. తాను ఎక్కడికీ వెళ్లలేదని హైదరాబాద్‌లోనే ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసిన ఆమె.. ప్రస్తుతం తాను ఓ ఫామ్ హౌస్‌లో చిల్ అవుతున్నానని చెప్పారు. తనకు బెంగళూరు రేవ్ పార్టీతో సంబంధం లేదని, అనవసరంగా తనను ఈ అంశంలోకి లాగుతున్నారని, ఫేక్ న్యూస్‌ను ఎవరూ నమ్మొద్దని కోరారు.

గుట్టు రట్టయ్యేనా?..

బెంగళూరు రేవ్ పార్టీ టాలీవుడ్‌లో మరోసారి దుమారంగా మారుతోంది. ఈ పార్టీకి పలువురు సినీతారలు హాజరుకావడంతో పాటు డ్రగ్స్ ఉపయోగించారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇదివరకే బెంగళూరులో నమోదైన డ్రగ్స్ కేసులతో టాలీవుడ్ ఇండస్ట్రీ లింకులు బయటపడ్డాయి. అలాగే తెలంగాణలోని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి సైతం గతంలో ఈడీ నోటీసులు ఇచ్చి విచారించడం హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఘటనలో ఎవరెవరి పేర్లు బయటకు రాబోతున్నాయి? ఎవరెవరు డ్రగ్స్ వినియోగించారనే సంగతి సస్పెన్స్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed