ఇందుకేనా తెలంగాణ తెచ్చుకుంది? ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్

by Hamsa |   ( Updated:2023-05-06 10:06:15.0  )
ఇందుకేనా తెలంగాణ తెచ్చుకుంది? ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్ర వ్యక్తిని సీఎం పర్సనల్ సెక్రటరీ గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై దిశ పత్రికలో వచ్చిన క్లిప్పింగ్‌ పోస్ట్ చేస్తూ.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ట్విట్టర్ వేదికగా శనివారం స్పందించారు. ప్రాణ త్యాగాలు చేసిన తెలంగాణ యువకులు ఒక్కరు లేరా పనిలో పెట్టుకోవడానికి అని ప్రశ్నించారు. ప్రాణాలు ఇవ్వడానికి పోరు నడపడానికి మేము కావాలి పదవులు వేరే వాళ్లకా అని నిలదీశారు. మహారాష్ట్ర ఇంజనీర్‌కు తెలంగాణ సీఎంఓలో లక్షన్నర జీతంతో కొలువు ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల సొమ్ము ఎవరిపాలు అవుతుందో బీఆర్ఎస్ నాయకులు చెప్పాలని, ఇందుకేనా తెలంగాణ తెచ్చుకుంది అని ప్రశ్నించారు. మరో ట్వీట్ చేస్తూ.. ‘ది కేరళ స్టోరీ’ మరో వక్రీకృత ఉగ్రవాదానికి ప్రతిబింబం అని తెలిపారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు.

Advertisement

Next Story