- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేడిగడ్డ పని తీరుపై సమగ్ర సమీక్ష జరగాలి.. టీజేఎస్ చీఫ్ కోదండరాం డిమాండ్
దిశ ,తెలంగాణ బ్యూరో : మేడిగడ్డ ప్రాజెక్ట్ లో అనేక లోపాలు ఉన్నాయని, అందుకే ప్రాజెక్ట్ పనితీరుపై సమగ్ర సమీక్ష జరపాలని టీజేఎస్ చీఫ్ కోదండరాం డిమాండ్ చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టులో మొత్తం 17 పంపులతో రోజు రెండున్నర నుండి మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు వీలుండేది కానీ డిజైన్ లోపం కారణంగా గత వర్ష కాలంలో మోటార్లు నీటిలో మునిగిపోయాయని తెలిపారు. దీంతో ఇప్పుడు కేవలం పావు టీఎంసీలతో నీరు ఎత్తిపోస్టున్నారని తెలిపారు. దీనికి గల కారకులు ఎవరో తెలపాలని .. ఈ ప్రాజెక్ట్ లో వాడిన కరెంట్ కు బిల్లులు చెల్లించలేదా .. లేక మోటార్లు రిపేర్ కాలేదా అనే విషయాలను తెలపాలని కోరారు. ఒకప్పుడు కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్ట్ లను, పంప్ హౌసులను సందర్శించేందుకు పెద్దఎత్తున టూరిస్టులను ఆహ్వానించి ఇప్పుడు ఎవరిని ఎందుకు అనుమతిండంలేదని ప్రశ్నించారు. కనీసం ఇంజినీర్లకు కుడా అవకాశం లేదన్నారు. ప్రజలకు కూడా అవకాశం కలిపించాలని అన్నారు.
జూన్ నెల నుండి ప్రాణహిత నది నుండి నది ప్రవాహం పెరిగి మేడిగడ్డ ప్రాజెక్టులోకి 40 టి ఏం సి ల నీరు వస్తే 34 గేట్లను ఎత్తి 23 టీఎంసీల నీటిని ప్రభుత్వం కిందికి వదిలేశారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కేవలం 17 టి ఎంసీ ల సామర్థ్యం వుండడంతో ఆ నీరు మాత్రమే ఇపుడు నిల్వ ఉందని పేర్కొన్నారు. నీటి ప్రాజెక్టులను కట్టుకునేది వరద నీటిని నిల్వచేసుకోని వాడుకునేందుకు అని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇందుకే డిజైన్ చేశామని చెబుతున్న ప్రభుత్వం మరి నీటిని నిల్వచేయకుండా ఎందుకు కిందికి వదిలేరని అయన ప్రశ్నించారు. మేడిగడ్డ ప్రాజెక్టులో మొత్తం 17 పంపులు ఉండగా కేవలం 6 పంపులు పనిచేస్తున్నాయో వివరణ ఇవ్వలని దీనిపై ప్రభుత్వం ఒక శ్వేతా పత్రాన్ని విధుల చేయాలనీ డిమాండ్ చేసారు. గత వర్షాకాలం మోటర్లన్నీ నీటిలో మునిగిపోయాయని చెప్పారు. వరద ఏ స్థాయికి వస్తుంది .. వరద ఉదృతి వస్తే ముంపు ఎక్కడ సంభవిస్తుందని అంచనా వేయడంలో, డిజైన్ చేయడంలో లోపాలు బట్టబయలు అయ్యాయని ఆరోపించారు.