- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
300 కెమెరాలు.. 600 మంది పోలీసులు.. తెలంగాణ నూతన సచివాలయానికి పటిష్ట భద్రత!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నూతన హంగులతో నిర్మిస్తో్న్న కొత్త సచివాలయం ఈ నెల 30వ తేదీన ప్రారంభానికి ముస్తాబవుతోంది. సీఎం కేసీఆర్ ఈ నెల 30వ తేదీన నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. నూతన సెక్రటేరియట్ ఓపెనింగ్ పనులు చక చక జరుతుగుతున్నాయి. అయితే, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయానికి భద్రతను కూడా కట్టుదిట్టంగా ఏర్పాటు చేస్తున్నారు. నూతన సచివాలయానికి 600 మంది తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీసులు భద్రత కల్పించనుండగా.. 300 సీసీ కెమెరాలతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తున్నారు.
సెక్రటేరియట్ ప్రాంతంలో చీమ చిటుక్కుమన్నా తెలిసేలా పటిష్టమైన మూడంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 30వ తేదీన సెక్రటేరియట్ ఓపెనింగ్ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ శుక్రవారం కొత్త సెక్రటేరియట్‌లో పోలీసు అధికారులతో భద్రతను సమీక్షించారు. ఈ సందర్భంగా భద్రతపై డీజీపీ అంజనీ కుమార్ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కమాండెంట్ స్థాయి అధికారితో నూతన సచివాలయానికి భద్రత కల్పిస్తున్నట్టు తెలిపారు. పోలీసు అధికారులతో కలిసి ఆయన ప్రారంభోత్సవ పనులను పరిశీలించారు.