- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ నూతన సచివాలయం చుట్టూ పటిష్ట భద్రత.. ఎందుకంటే?
దిశ, తెలంగాణ బ్యూరో: కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్ చుట్టూ పటిష్టమైన భద్రత కోసం సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఎస్పీఎఫ్ ను తప్పించి ఆ బాధ్యతలను గ్రేహౌండ్స్, ఆక్టోపస్ వింగ్ కు ఇవ్వాలని భావిస్తున్నారు. దీనిపై ప్లానింగ్ చేయాలని ఇప్పటికే పోలీసు అధికారులను ఆదేశించారు.
వద్దంటూ పోలీసు ఆఫీసర్ల రిపోర్ట్?
మావోయిస్టులు, తీవ్రవాదుల కట్టడి కోసం ప్రభుత్వం గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. విపత్కర పరిస్థితుల్లో సైతం టార్గెట్ పూర్తి చేసేలా ట్రైనింగ్ ఇచ్చింది. అలాంటి వారికి సెక్యూరిటీ డ్యూటీలు వేయడం సరికాదని సీనియర్ పోలీసు ఆఫీసర్లు అభిప్రాయపడినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టులో పేర్కొనట్టు సమాచారం.
స్పెషల్ పోలీస్ వింగ్‌కు..!
సెక్రటేరియట్ సెక్యూరిటీ అంశంలో గత నెలలో చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ప్రత్యేకంగా రివ్యూ చేశారు. బాధ్యతలను ఏకే 47 తుపాకులతో పహరా కాసే తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీసు వింగ్‌కు ఇవ్వాలని తీర్మానించినట్టు సమాచారం. అయితే మూడు దశబ్దాలుగా విధుల్లో ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కు అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజలతో ఎలా డీల్ చేయాలో అనుభవం ఉంది. ఇప్పుడు కొత్త దళాలకు సెక్యూరిటీ బాధ్యతలు అప్పగిస్తే కొత్త సమస్యలు వచ్చే ప్రమాదముందనే చర్చ జరుగుతున్నది.