Tiger : ఆసిఫాబాద్ జిల్లా మాకాడి వద్ద రైలు పట్టాలు దాటిన పులి

by Y. Venkata Narasimha Reddy |
Tiger : ఆసిఫాబాద్ జిల్లా మాకాడి వద్ద రైలు పట్టాలు దాటిన పులి
X



దిశ, వెబ్ డెస్క్ : కొమురం భీమ్ అసిఫాబాద్(Asifabad district)జిల్లా వాసులను వణికిస్తున్న పెద్ద పులి(Tiger) తాజాగా జిల్లాలోని మాకాడి(Makadi )వద్ద రైలు పట్టాలు దాటుతు (Crosses Railway Tracks) స్థానికులకు కనిపించింది. పులిని చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పులి తాపీగా పట్టాలు దాటుతూ ముందుకెళ్లిపోయింది. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం ఇటీవల ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. కాగజ్ నగర్ మండలం గన్నారంలో ఓ యువతిపై దాడి చేసి హతమార్చిన పులి, ఆ తర్వాత రోజునే దుబ్బగూడలో మరో రైతుపై దాడి చేసి గాయపరిచింది. పశువులపై దాడులు కొనసాగిస్తోంది. కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) మండలం హుడ్కిలి లో దూడపై దాడి చేసిన పెద్దపులి అనంతరం వెంపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద, మాకిడి రైల్వే క్యాబిన్ సమీపంలో రైలు పట్టాలు దాటుతూ కనిపించింది.

Advertisement

Next Story