బయట మందులు పనిచేయవు..మా ఆసుపత్రి మందులే వాడాలి.. ఓ ఆసుపత్రి హుకుం

by Aamani |
బయట మందులు పనిచేయవు..మా ఆసుపత్రి మందులే వాడాలి.. ఓ ఆసుపత్రి హుకుం
X

దిశ,కార్వాన్ : బయట మందులు పనిచేయవు.. మా ఆసుపత్రిలో ఉన్న మందులే వాడాలి అంటూ ఓ ఆసుపత్రి యాజమాన్యం రోగుల బంధువులకు హుకుం జారీ చేస్తున్నారు. రోగం నయం కావాలంటే మా ఆసుపత్రిలో ఉన్న మందులే తీసుకోవాల్సిందే అంటూ హైదర్ గూడ ఓల్డ్ ఎమ్మెల్యే కోట్రస్ లోని ఫెర్నాండెస్ ఆసుపత్రి యాజమాన్యం తెలుపుతున్నారు. సిద్దేశ్వర్ అనే వ్యక్తి హైదర్ గూడ ఓల్డ్ ఎమ్మెల్యే కోట్రస్ లోని ఫెర్నాండెస్ ఆసుపత్రిలో తన మనవరాలు రెండు నెలల క్రితం ప్రసవం జరిగింది. కాగా సిద్దేశ్వర్ తన మనవరాలికి రెండవ నెల వ్యాక్సిన్ వేయించేందుకు బుధవారం ఫెర్నాండెస్ ఆసుపత్రికి వెళ్లాడు.

అయితే ఆసుపత్రిలో వ్యాక్సిన్ల ధరలు ఎక్కువగా ఉండటంతో తనకు తెలిసిన వారి మెడికల్ షాప్ లో మందులు కొనుక్కొని వచ్చి ఆసుపత్రి యాజమాన్యానికి ఇవ్వగా వారు నిరాకరించారు. అంతే కాకుండా తమ ఆసుపత్రిలో బయట మందులు వేయరని ఇక్కడే మందులను కొనుక్కొని వాడాలని ఆసుపత్రి వర్గాలు సూచించినట్లు సిద్దేశ్వర తెలిపారు.రూ.600 కన్సల్టెన్సీ ఫీజు కూడా వారు తీసుకున్నట్లు సిద్దేశ్వర తెలిపారు. అయితే చేసేదేమీ లేక భాదితుడు తన మనవరాలికి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వ్యాక్సిన్ వేయించుకున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story