మార్కెటింగ్‌ వ్యవస్థలో కొత్త కార్యాచరణ

by Aamani |
మార్కెటింగ్‌ వ్యవస్థలో కొత్త కార్యాచరణ
X

దిశ, వరంగల్‌ టౌన్ : వ్యవసాయ మార్కెట్లు, రైతుల మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. పంట ఉత్పత్తులు విక్రయాలు, ఇతరత్రా సమాచారం మార్కెట్లలో క్రోఢీకరించబడి ఉంటుంది. ముఖ్యంగా పత్తి కొనుగోళ్లలో రైతుల వివరాలు పూర్తిస్థాయిలో నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే, కొన్ని రాష్ట్రాల్లో ఈ పద్ధతిని అమలు చేయడం లేదని తెలుస్తోంది. దీంతో కేంద్రం ప్రైస్‌ డెఫిసిట్‌ పేమెంట్‌ స్కీమ్‌ (పీడీపీఎస్‌) కొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. దీనిపై అవగాహన కల్పించేందుకు నీతి ఆయోగ్‌ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వివిధ రాష్ట్రాల నుంచి పలువురు ప్రతినిధులు హాజరయ్యారు. వరంగల్‌ నుంచి తెలంగాణ కాటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, వరంగల్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి హాజరయ్యారు.

Advertisement

Next Story