- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
దిశ,మేడ్చల్ బ్యూరో : మధ్నాహ్న భోజన కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీజేపీ మేడ్చల్ నియోజకవర్గం ఇన్ చార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న మధ్యాహ్న బోజన కార్మికులను కలిసి సుదర్శన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు 8 రూపాయల 17 పైసలు మాత్రమే ప్రభుత్వం ఇస్తుందన్నారు.
ఈ డబ్బులతోనే గుడ్డు, రెండు రకాల కూరలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఒక్కో నిర్వాహకురాలికి 6 నెలల నుండి బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ధనిక రాష్ట్రంలో వందల కోట్ల రూపాయలతో ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చే ప్రభుత్వం బడా కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు పెరిగిన రేట్లకు బిల్లులు చెల్లిస్తూ బడుగు, బలహీన వర్గాల బిడ్డలకు భోజనాలను అందిస్తున్న నిర్వాహకులపై మాత్రం కనికరం చూపడం లేదన్నారు. ప్రభుత్వం గిట్టుబాటు అయ్యేలా బిల్లులు చెల్లించాలని సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు.