Pushpa-2:‘తగ్గేదే లే’ అంటున్న పుష్ప రాజ్.. హిందీలో మరో రికార్డు!

by Jakkula Mamatha |
Pushpa-2:‘తగ్గేదే లే’ అంటున్న పుష్ప రాజ్.. హిందీలో మరో రికార్డు!
X

దిశ,వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్(Icon Star) అల్లు అర్జున్(Allu Arjun), నేషనల్ క్రష్ రష్మిక(Rashmika) జంటగా.. సుకుమార్(Director Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘పుష్ప-2 ది రూల్’’(Pushpa-2 Movie) మూవీ ఈ నెల 5వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి మంచి టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు భారీ కలెక్షన్లు వసూలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద పుష్ప రాజ్ హవా కొనసాగుతోంది. పాన్ ఇండియా మాత్రమే కాదు.. వరల్డ్ వైడ్ గా పుష్ప-2 వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.

ఈ క్రమంలో పుష్ప-2 ది రూల్ మూవీ ప్రస్తుతం అన్ని భాషల్లో దూసుకెళ్తుంది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీందీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. ఆయన నటించిన పుష్ప-2 మూవీ అక్కడి ప్రేక్షకులకు ఎంతో నచ్చేసింది. దీంతో భారీగా కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు హిందీలో రూ.601.50 కోట్లు(నెట్) వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. అత్యంత వేగంగా ఈ మార్కును దాటిన సినిమాగా నిలిచినట్లు వెల్లడించారు.

Advertisement

Next Story