- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరంగల్ బల్దియాకు భారీ బలగం..పలు పోస్టుల్లో భర్తీ
దిశ,వరంగల్ టౌన్ : గ్రేటర్ వరంగల్ బల్దియాకు భారీ సంఖ్యలో ఉద్యోగ బలగం రాబోతోంది. ఇటీవల గ్రూప్ ` 4లో అర్హత సాధించిన అభ్యర్థులను ప్రభుత్వం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అందులో 43మందిని వరంగల్ బల్దియాకు కేటాయించారు. వీరు పలు పోస్టుల్లో నియమితులయ్యారు. ఈ మేరకు మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ నుంచి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. వీరిలో ఏడుగురు జూనియర్ అకౌంటెంట్లు, ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లు కాగా, మిగతా వారు డివిజన్ అధికారులుగా నియమితులైనట్లు తెలుస్తోంది. కాగా, బల్దియా చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఉద్యోగులు నియమితులు కావడం గమనార్హం.
కరోనా సమయంలో 452 మందిని నియమించినా కాంట్రాక్ట్ పద్ధతిలోనే.. అది కూడా పబ్లిక్ హెల్త్ విభాగంలోనే నియామకాలు జరిగాయి. తాజాగా, మరో 250 మందిని సైతం పీహెచ్ విభాగంలో తీసుకోనుండగా, ప్రభుత్వం నుంచి నేరుగా ఉద్యోగులు రానుండడం చర్చనీయాంశంగా మారింది. బల్దియాలో చాలా ఏళ్లుగా ఉద్యోగులు పూర్తి స్థాయిలో లేకపోవడం తో పాలన వ్యవహారాలు మందకొడిగా సాగుతున్నాయి. ప్రధానంగా క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై స్పందించడంలో బల్దియా జాప్యం చేస్తున్నదనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి.
వార్డుల్లో సమస్యలను మొరపెట్టుకోవడానికి గ్రీవెన్స్‌సెల్ ఉన్నప్పటికీ అంతా ఉన్నతాధికారులే కావడంతో క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ప్రజలు బల్దియా తీరుపై అసహనంతోనే ఉన్నారు. ఏదైతేనేమీ.. బల్దియాకు భారీ సంఖ్యలో బలగం రానుండడం.. అందులో డివిజన్ అధికారులు నియమితులవడం.. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమవుతుందని అంతా భావిస్తున్నారు.