Prabhas: రాజాసాబ్ పోస్ట్ పోన్.. క్లారిటీ ఇస్తూ అఫీషియల్ నోట్ రిలీజ్ చేసిన మేకర్స్

by sudharani |
Prabhas: రాజాసాబ్ పోస్ట్ పోన్.. క్లారిటీ ఇస్తూ అఫీషియల్ నోట్ రిలీజ్ చేసిన మేకర్స్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ మారుతి (Maruti) కాంబోలో వస్తున్న చిత్రం 'రాజా సాబ్' (Raja Saab). మాళవికా మోహనన్ (Malavika Mohanan), నిధి అగర్వాల్ (Nidhi Agarwal) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం. కానీ, తాజాగా రిలీజ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ‘రాజా సాబ్’ రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉందని, షూటింగ్‌తో పాటు వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావని, అందుకే ఈ చిత్రం 2025 ఏప్రిల్‌లో విడుదల చేయడం కష్టమే అంటూ సోషల్ మీడియాలో వార్తలు హాట్ టాపిక్‌ (hot topic)గా వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే.. సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతున్న రూమర్స్‌ (rumors)పై మూవీ టీమ్ స్పందిస్తూ అఫీషియల్ నోట్ (Official Note) రిలీజ్ చేశారు. ఈ మేరకు ‘ది రాజా సాబ్ షూటింగ్ నిరంతరాయంగా డే అండ్ నైట్ (Day and Night) షెడ్యూల్స్‌తో శరవేగంగా సాగుతోంది. దాదాపు 80% షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ సందర్భంగా టీజర్ విడుదల గురించి రకరకాల ఊహాగానాలు చెలామణి అవుతున్నాయని మేము గమనించాము. ఈ తప్పుడు పుకార్లను నమ్మవద్దని దయతో కోరుతున్నాము. సరైన సమయంలో సినిమాకు సంబంధించిన సమాచారం మేమే అధికారికంగా ప్రకటిస్తాము’ అంటూ నోట్ రిలీజ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed