Harish Rao Thanneeru: మీ పాలనలో దారుణాలకు మరో నిదర్శనం

by Ramesh Goud |   ( Updated:2024-12-18 14:31:15.0  )
Harish Rao Thanneeru: మీ పాలనలో దారుణాలకు మరో నిదర్శనం
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ గురుకులాల్లో(Gurukulas) జరుగుతున్న దారుణాలకు ఇది మరో నిదర్శనమని బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు(BRS Leader Thanneeru Harish Rao) ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District) రాగి జావ మీద పడి ఓ విద్యార్థికి గాయాలు కాగా.. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించిన హరీష్ రావు.. ప్రభుత్వంపై సంచలన విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన.. 1971లో ముఖ్యమంత్రి హోదాలో దివంగత పీవీ నరసింహారావు(PV Narsimha Rao) దేశంలో మొదటి గురుకులన్ని(First Gurukulka) యాదాద్రి భువనగిరి జిల్లా, సర్వేల్‌లో ప్రారంబించారని, నేడు అదే గురుకులంలో విద్యార్థినితో వంట చేయిస్తే, వేడి రాగి జావ పడి ఆ విద్యార్థి తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఒకవైపు అసెంబ్లీలో(Telangana Assembly) గురుకులాలపై చర్చ, మరోవైపు అదే సమయంలో ఈ దారుణం జరిగిందని చెప్పారు. అలాగే గురుకులల్లో దారుణమైన పరిస్థితుల గురించి ప్రశ్నిస్తే ప్రతిపక్షాల(Oppositions) గొంతు నొక్కడమే తప్ప, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని, మీ పాలనలో రోజురోజుకి దిగజారుతున్న గురుకులాల ఖ్యాతిని కాపాడండి అంటూ.. గాయపడ్డ విద్యార్థినికి మంచి వైద్యం అందించాలని మాజీమంత్రి డిమాండ్ చేశారు.

Advertisement

Next Story