సమస్యల పరిష్కారానికి న్యాయ సేవా అధికార సంస్థ ఉంది

by Naveena |
సమస్యల పరిష్కారానికి న్యాయ సేవా అధికార సంస్థ ఉంది
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి న్యాయ సేవా అధికార సంస్థ ఉందని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి,సీనియర్ సివిల్ జడ్జి ఇందిర అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి,జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మెన్ పాపిరెడ్డి ఆధేనుసారం బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఏనుగొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రతి సమస్య పరిష్కారానికి చట్టం ఉందని,మహిళలకు చట్టాల గురించి తెలిసి ఉండాలని ఆమె అన్నారు. లీగల్ సర్వీసెస్ యాక్ట్,ఫోక్స్,డైవర్షన్ కేసులు,బాలల హక్కులు,బాధ్యతలు,ఫ్రీ లీగల్ ఎయిడ్ లాంటి అనేక చట్టాల ఉన్నవని,న్యాయవాదులు,సలహాలు,సూచనలు ఇస్తారని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి జరీనా బేగం,సెంటర్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ మహబూబ్ నగర్ సౌజన్య,కౌన్సిలర్ జ్యోతి,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed