- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TPCC: ఆయన పేరు ఎత్తితే అమిత్ షాకు వణుకు.. అద్దంకి దయాకర్ హాట్ కామెంట్స్
దిశ, వెబ్ డెస్క్: అంబేద్కర్(Dr.BR Ambedkar) పేరు ఎత్తితే హోం మంత్రి అమిత్ షా(Union Minister Amit Sha)కు వణుకు పుడుతుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్(TPCC Genaral Secretary Addanki Dayakar) అన్నారు. పార్లమెంట్(Parliament) లో అమిత్ షా ప్రసంగంపై స్పందించిన ఆయన.. ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ బదులు ఇన్ని సార్లు దేవుడి పేరు ఎత్తితే స్వర్గంలో ఉండే వారని అమిత్ షా అంటున్నాడని, అలాంటి వ్యక్తి రాజ్యాంగాన్ని గౌరవిస్తాడంటే ఎవరు నమ్ముతారని అన్నారు. అలాగే బీజేపీ(BJP), ఆర్ఎస్ఎస్(RSS) అంబేద్కర్ ని అవమానిస్తున్నారంటే అది అమిత్ షా రూపంలో చూడవచ్చని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమిత్ షాకు అంబేద్కర్ పేరు ఎత్తితే ఎందుకు వణుకు పుడుతుందో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.
అంబేద్కర్ రాసిన రాజ్యంగం వల్ల హోంమంత్రి అయిన అమిత్ షా రాజకీయాలకు అవసరమా అని మండిపడ్డారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇలాంటి వ్యక్తులను కేంద్ర మంత్రులను(Union Ministers) చేసి అంబేద్కర్ భావజాలాన్ని అణిచివేసే కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. అంతేగాక నేర చరిత్ర ఉన్న ఇలాంటి వ్యక్తులకు అంబేద్కర్ అనే పేరు నచ్చదని తెలిపారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ బడుగు బలహీన వర్గాల ఓట్ల కోసమే అంబేద్కర్ మంత్రం జపిస్తారని, నిండు సభలో అంబేద్కర్ కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు అమిత్ షాను డిస్మిస్(Dismiss) చేయాలని డిమాండ్(Demand) చేశారు. అంబేద్కర్ కు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లు రాజ్యాంగాన్ని గౌరవించినట్లు కాదని, ఆయనను వ్యతిరేకంగా చూసే పార్టీలకు ఈ దేశంలో పుట్టగతులు ఉండవని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party) అంబేద్కర్ తో రాజ్యాంగం రాయించిడమే గాక ఆ స్థాయి గౌరవం కూడా ఇచ్చిందని, బీజేపీ నాయకులు(BJP Leaders) ఆత్మపరిశీలన చేసుకోవాలని కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు. అంతేగాక ఆయన పెట్టిన ట్వీట్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షాకు రాజకీయాలలో ఉండే అర్హత లేదని, వెంటనే అమిషా తన మంత్రిపదవికి రాజీనామాచేసి స్వర్గానికి వెళ్తే మంచిది అని రాసుకొచ్చారు.