Hyderabad Book Fair : రేపు హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభం

by M.Rajitha |
Hyderabad Book Fair : రేపు హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్ : పుస్తక ప్రియులు ఎంతగానో ఎదురు చూసే హైదరాబాద్ బుక్ ఫెయిర్(Hyderabad Book Fair) రేపు ప్రారంభం కానుంది. 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ గురువారం ఎన్టీఆర్ గ్రౌండ్స్(NTR Grounds) లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈనెల 19 నుంచి 29 వరకు కొనసాగనున్న ఈ ఫెయిర్ లో 300 లకు పైగా... స్టేట్, నేషనల్ బుక్ పబ్లిషర్స్ తమ స్టాల్స్ ను ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ ఏడాది బుక్ ఫెయిర్ టైమింగ్స్ మార్చారు. ప్రతి ఏడాది మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ఉండగా, ఈసారి మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఈసారి హైదరాబాద్ ప్రత్యేక వంటకాలు కూడా ఉండబోతున్నాయి. ఈ బుక్ ఫెయిర్ కు నగర వాసులే కాకుండా అని జిల్లాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి పుస్తక ప్రియులు భారీగా తరలి వస్తారు. ఈసారి సౌకర్యాలు మరింత మెరుగు పరిచినట్టు బుక్ ఫెయిర్ నిర్వాహకులు తెలియజేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, బుక్ ఫెయిర్ అధ్యక్షులు షేక్ యాకూబ్ తదితరులు హాజరవనున్నారు.

Advertisement

Next Story

Most Viewed