గుడుంబా విక్రయదారులు బైండోవర్

by Sridhar Babu |
గుడుంబా విక్రయదారులు బైండోవర్
X

దిశ, సుల్తానాబాద్ : గుడుంబా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని తహసీల్దార్ ముందు బైండోవర్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ గురునాథ్ రాథోడ్, ఎస్సై కేఎస్ఎస్ఎన్ రాజు తెలిపారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం లోని మల్యాల గ్రామానికి చెందిన బొల్లి సమ్మమ్మ గత నెలలో గుడుంబా అమ్ముతూ పట్టుబడగా తహసీల్దార్ ముందు హాజరు పరిచారు. దాంతో రూ.లక్ష పూచీకత్తుపై విడుదల చేశారు. తిరిగి మరలా గుడుంబా అమ్మి బైండోవర్ఉ ల్లంగించినందుకు నోటీసులు ఇచ్చారు.

అలాగే అదే గ్రామానికి చెందిన పల్లపు ఓదేలు గుడుంబా అమ్ముతూ పట్టుబడడంతో తహసీల్దార్ ముందు హాజరుపరచగా రూ. లక్ష పూచీకత్తుపై బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ ఎక్సైజ్ సీఐ గురునాథ్ రాథోడ్ మాట్లాడుతూ ఇకముందు మండలంలో ఎవరైనా గుడుంబా తయారుచేసినా, అమ్మినా ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సై చిరంజీవి, సిబ్బంది రమణ, బీర్బల్, అరవింద్, దేవేంద్ర పాల్గొన్నారు.

Advertisement

Next Story