దొంగల ముఠా రిమాండ్

by Sridhar Babu |
దొంగల ముఠా రిమాండ్
X

దిశ,తిరుమలాయపాలెం : గత కొన్నాళ్లుగా వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను బుధవారం తిరుమలాయపాలెం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్, శివనగర్, లేబర్ కాలనీ ప్రాంతానికి చెందిన చిరుపాటి సాలమ్మ, చిరుపాటి ఎల్లమ్మ, తూరుపాటి లక్ష్మి, తూరుపాటి సునీతతోపాటు ఆటో డ్రైవర్ సరికిటి ఎల్లస్వామి అనే దొంగల ముఠా సభ్యులు కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లో కొన్నేళ్లుగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు.

తాజాగా ఆదివారం రాత్రి తిరుమలాయపాలెం గ్రామంలోని హెచ్ పీ పెట్రోల్ బంక్ సమీపాన, ఎయిర్ సెల్ టవర్ కు సంబంధించిన కరెంట్ డీబీ చోరీ చేసేందుకు ప్రయత్నించగా స్థానికులు గమనించడంతో అక్కడ నుంచి ఆటోలో పరారయ్యారు. వెంబడించిన స్థానికులు ఆటో నెంబర్ నమోదు చేసుకుని తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్ఐ కూచిపూడి జగదీష్ వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి సీసీ ఫుటేజ్ ల ఆధారంగా ఐదుగురు దొంగలను పట్టుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్ కు తరలించినట్టు ఎస్సై తెలిపారు.

Advertisement

Next Story