యథేచ్చగా వీధి వ్యభిచారం..

by Aamani |
యథేచ్చగా వీధి వ్యభిచారం..
X

దిశ,చైతన్యపురి : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెంపొందుతున్న హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకు వీధి వ్యభిచారం యథేచ్ఛగా కొనసాగుతుంది. పర్యవేక్షణ లేకపోవడం వలన తద్వారా ఎక్కడపడితే అక్కడ వీధి వ్యభిచారం యథేచ్చగా కొనసాగుతుంది. ఇలాంటి వాటిని అరికట్టాలని పలుమార్లు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందని కాలనీలు ప్రజలు వాపోతున్నారు.

ఎక్కడ జరుగుతుంది..

వీధి వ్యభిచారం కామినేని చౌరస్తాలో, దిల్ సుఖ్ నగర్ లో, చైతన్యపురి లో మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతుంది. కామినేని చౌరస్తా నుండి సిరీస్ రోడ్డులో కొంతమంది మహిళలు జట్టుగా ఏర్పడి వీధి వ్యభిచారం కొనసాగిస్తున్నారు. పక్కనే ఉన్న లాడ్జిలు, ఓయో గదులు వీరికి అడ్డాగా మారాయి. రోడ్డు వెంట నిలబడి విటులను ఆకర్షించే సమయంలో అటుగా వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు వెంట ఎవరైనా మహిళ తమకు తెలిసిన వారి కోసం నిలబడితే అటుగా వచ్చే విటులు వీరి పట్ల అసభ్యకరంగా చూస్తున్నారు. తద్వారా వారు అసౌకర్యానికి గురవుతున్నారు.

చైతన్యపురి మెట్రో సమీపంలోని నెక్సా కార్ షోరూం నుండి లలిత జ్యువెలర్స్ వరకు, సరూర్ నగర్ చెరువు కట్ట డౌన్ ప్రాంతంలో, దిల్ సుఖ్ నగర్ సాయిబాబా ఆలయానికి సమీపంలోని సర్వీస్ రోడ్డు నుండి కోణార్క్ థియేటర్ వరకు కొంతమంది మహిళలు నిలబడి విటులను ఆకర్షిస్తుంటారు. తద్వారా అటువైపు వెళ్లే ఇతర మహిళలకు ఇబ్బందిగా మారి ఎవరికీ చెప్పలేకపోతున్నారు. చుట్టుపక్కల కాలనీవాసులకు అసురక్షిత వాతావరణాన్ని కలిగిస్తున్నారు. పైన పేర్కొన్న ప్రదేశాల చుట్టుపక్కల ఉన్న లాడ్జిలు వీరికి సురక్షిత కేంద్రం గా మారాయి. సిరీస్ రోడ్డులోని శివగంగా కాలనీ ప్రధాన రహదారిపై ఓయో లాడ్జిలు ఉండటం వలన ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. రెసిడెన్షియల్ జోన్, స్కూల్స్, హాస్పిటల్స్ ఉన్నాయి. వీరి ప్రవర్తన వలన కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చర్యలు తీసుకోవాలి..

ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల పట్ల పోలీసులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. సమస్యను పరిష్కరించడానికి పోలీసు యంత్రాంగం ప్రయత్నాలు చేస్తున్నా ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ జరుగుతున్నాయి. నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉంటాయి. ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.

చర్యలు తీసుకున్న అంతే..

గత మూడు నెలల క్రితం పోలీసులు ఇలాంటి వారి పట్ల చర్యలు తీసుకున్నా తిరిగి శరా మామూలే అయ్యాయి. వీరిని పట్టుకుని సరూర్ నగర్ తహసీల్దార్ ముందు బైండోవర్ చేసి హెచ్చరికలు చేసినా ఫలితం లేకుండా పోయింది.

Advertisement

Next Story

Most Viewed